Mango: ఈ 5 ఆహారాలను మామిడి పండ్లతో కలిపి అస్సలు తినకండి

ఆయుర్వేదం ప్రకారం ఈ 5 ఆహారాలను మామిడితో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు. పాలు, స్పైసీ ఫుడ్, పెరుగు, కాకరకాయ, నీళ్లను మామిడి పండ్లతో కలిపి తినడం మంచిది కాదు. ఇది కడుపులో గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

Mango: ఈ 5 ఆహారాలను మామిడి పండ్లతో కలిపి అస్సలు తినకండి
New Update

Mango: వేసవి వచ్చిందంటే మామిడి పండ్ల జాతర మొదలవుతుంది. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ 5 ఆహారాలను మామిడితో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హాని అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము

ఆయుర్వేదం ప్రకారం, ఈ 5 పదార్థాలతో మామిడిని తినవద్దు

పాలు

ఆయుర్వేదం ప్రకారం, పాలు, మామిడిని కలిపి తీసుకోవడం మానుకోవాలి. ఈ ఆహార కలయికలు జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. గ్యాస్, ఎసిడిటీ వంటి పొట్టకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి.

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత మామిడిపండు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. సహజంగానే స్పైసీ ఫుడ్ జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెడుతుంది. దానికి తోడు పుల్లని మామిడి పండు తినడం ద్వారా కడుపు చికాకు, గ్యాస్ అజీర్ణానికి దారి తీసే అవకాశం ఉంది.

పెరుగు

చాలా మంది వేసవిలో మ్యాంగో లస్సీని తాగడానికి ఇష్టపడతారు. పెరుగు, మామిడి మిశ్రమంతో సలాడ్ లేదా డెజర్ట్ చేసుకుంటారు. కానీ ఈ కలయిక జీర్ణవ్యవస్థ పై చెడు ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, పెరుగు, మామిడిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. ఇది అలెర్జీలు , చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

publive-image

కాకరకాయ

మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ తినకూడదు. ఇలా చేయడం వల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది.

నీళ్లు

మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం చాలా మంది చేసే పొరపాటు. కానీ ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి, అసిడిటీ వచ్చే అవకాశం ఉంది. మామిడికాయ తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగాలి. ఆయుర్వేదం ప్రకారం, పండ్లతో కూడిన నీరు తాగడం వల్ల కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Copper Vessels: వేసవిలో రాగి పాత్రలు ఉపయోగించడం ఇంత ప్రమాదమా..! - Rtvlive.com

#mango
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe