Oil : చిన్న పిల్లలకు(Baby Kids) చెవి నొప్పి(Ear Pain) వచ్చినా లేదా చెవిలో వ్యాక్స్(Ear Wax) పేరుకుపోయినా చెవుల్లో నూనె వేయమని అమ్మమ్మలు తరచూ సలహా ఇస్తుంటారు. మీరు కూడా మీ చిన్నతనంలో చాలాసార్లు ఇలా చేసి ఉండవచ్చు. అయితే ఇలా చేయడం సరియైనదేనా..? కాదా? ఇప్పుడు తెలుసుకుందాము.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెవిలో నూనె వేయడం వల్ల సమస్యలు నయం కావు. ఇది చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిపోటు ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. చెవుల్లో నూనె వేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
చెవుల్లో నూనె వేయడం వల్ల కలిగే నష్టాలు
చెవుడు వచ్చే ప్రమాదం
చెవి నొప్పి లేదా వినికిడి లోపం ఉన్నప్పుడు చాలా సార్లు చెవుల్లో నూనె వేసుకుంటారు. కానీ అలా చేయడం వల్ల చెవి దెబ్బతింటుంది. దీని వల్ల మీకు శాశ్వత చెవుడు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. వైద్యులను సంప్రదించకుండా చెవిలో నూనె వేయకూడదు.
ఓటోమైకోసిస్ ప్రమాదం
చెవిలో నూనె వేయడం వల్ల ఒటోమైకోసిస్ వస్తుంది. దీని కారణంగా శాశ్వత వినికిడి వైకల్యం సంభవించవచ్చు.
చెవి ఇన్ఫెక్షన్
చెవిలో నూనె వేయడం వల్ల కూడా చెవి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి ఆయిల్‌లో చాలా రకాల బాక్టీరియాలు ఉంటాయి. దీని వల్ల చెవి ఇన్ఫెక్షన్ రావచ్చు. ఎందుకంటే చెవుల్లో నూనె వేయడం వల్ల చెవులు చాలా రోజుల పాటు తేమగా ఉంటాయి. ఇది చెవిలో దుమ్ము, ధూళి వంటి కాలుష్య కణాలు పేరుకుపోవడానికి కారణమవుతుంది. దీని వల్ల చెవి ఇన్ఫెక్షన్ రావచ్చు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
చీము సమస్య
చెవిలో నూనె వేయడం వల్ల చీము వంటి సమస్యలు వస్తాయి. ఇది కాకుండా, చెవిపోటు కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. చెవిలో సమస్య ఉన్నప్పుడు ఇంటి చికిత్సలు చేయడం అంత మంచిది కాదు. దానికి సంబంధించిన వైద్య నిపుణుల సలహాలు తీసుకోండి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Apricot: ఈ పండుతో బరువు తగ్గడం చాలా సింపుల్..? ట్రై చేయండి