Nail Polish: ప్రతి అమ్మాయి తన చేతులు, కాళ్ళను అందంగా కనిపించాలని ఇష్టపడుతుంది. దీని కోసం, ఆమె తన గోళ్లను వివిధ రంగుల నెయిల్ పెయింట్స్‌తో అలంకరించుకోవడం చేస్తుంటారు. అంతే కాదు ఈరోజుల్లో నెయిల్ ఆర్ట్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు అమ్మాయిలు. కానీ రోజంతా మీ చేతులపై ఉంచుకునే ఈ నెయిల్ పెయింట్ చాలా తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఫార్మాల్డిహైడ్, డిప్రోపైల్ థాలేట్ వంటి అనేక హానికరమైన రసాయనాలు దీనిలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. నెయిల్ పాలిష్ వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
మెదడుకు హాని కలిగించవచ్చు
నెయిల్ పాలిష్‌లోని ప్రమాదకరమైన రసాయనాలు మెదడుకు కూడా ముప్పు కలిగిస్తాయి. ఇవి మీరు తినేటప్పుడు లేదా నోట్లో వేళ్ళు పెట్టుకున్నప్పుడు శరీరం లోపలి వెళ్తాయి. అవి మెదడు కణాలలోకి ప్రవేశించడం ద్వారా చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఈ ప్రమాదకరమైన రసాయనాల వల్ల మెదడు రక్త ప్రసరణ దెబ్బతింటుంది. దీని కారణంగా, తలనొప్పి, బలహీనత అనిపించవచ్చు. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల కొందరికి వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి.
గర్భధారణ సమస్యలు
నెయిల్ పెయింట్ లోపల టోలున్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం మీ పునరుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది గర్భిణీ స్త్రీలకు మరింత ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రసాయనాలు కడుపులోని బిడ్డకు చేరి అనేక వ్యాధులకు కారణమవుతాయి. ఈ సమయంలో నెయిల్ పాలిష్ చాలా తక్కువగా లేదా వాడకపోవడమే మంచిది.
ఊపిరితిత్తులపై చెడు ప్రభావం
ఊపిరితిత్తులకు చాలా ప్రమాదకరమైనది నెయిల్ పాలిష్. దీన్ని చేయడానికి స్పిరిట్ ఉపయోగించబడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది లేదా శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కావున దీని రెగ్యులర్ వాడకాన్ని నివారించాలి. ముఖ్యంగా పిల్లలకు అందకుండా చూడాలి.
క్యాన్సర్ ప్రమాదం
నెయిల్ పెయింట్‌లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తాయి. వాస్తవానికి, నెయిల్ పెయింట్ లోపల అక్రిలేట్స్ అనే ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. ఇది కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని వాడకం వల్ల చర్మ క్యాన్సర్ కూడా వస్తుంది. నెయిల్ పాలిష్‌లో జెల్ కలుపుతారు, ఇది సూర్యుని ప్రమాదకరమైన కిరణాలను గ్రహిస్తుంది. తద్వారా క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశాలను పెంచుతుంది.