Fat Loss Tips: బాడీ ఫ్యాట్ ఇబ్బంది పెడుతుందా.. ఈ చిన్న చిట్కాతో కొవ్వు కరిగిపోతుంది తెలుసా..!

చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడతారు. ఈ సమస్య ఉన్నవాళ్లు కొవ్వు తగ్గించడం కాకుండా కేవలం బరువు తగ్గే ఆహారాల పై మాత్రమే ద్రుష్టి పెడతారు. ఇలా చేస్తే ప్రయోజనమేమి ఉండదు. కొవ్వు తగ్గడానికి జీవన స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలు. ఒత్తిడి తగ్గించడం, నిద్ర, వ్యాయామం చేయాలి.

New Update
Fat Loss Tips: బాడీ ఫ్యాట్ ఇబ్బంది పెడుతుందా.. ఈ చిన్న చిట్కాతో కొవ్వు కరిగిపోతుంది తెలుసా..!

Fat Loss Tips: అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడే వారు వారి రోజు దినచర్యలో రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. బరువు తగ్గాలని లో కెలరీ డైట్, ఫ్యాట్ ఫ్రీ డైట్ తీసుకోవడం పై ఎక్కువగా దృష్టి పెడతారు. కేవలం డైట్ మాత్రమే కాదు కొన్ని జీవన శైలి మార్పులు కూడా బరువు తగ్గడం పై మంచి ప్రభావం చూపును. కొవ్వు తగ్గించడం కాకుండ బరువు తగ్గే ఆహారాలు మాత్రమే తీసుకుంటారు. కానీ కొవ్వును తగ్గించడానికి మీ దినచర్యలో ఈ సింపుల్ అలవాట్లు పాటిస్తే చాలు.

శరీరంలో కొవ్వును తగ్గించే జీవన శైలి అలవాట్లు 

సరైన ఆహారపు అలవాట్లు

శరీర కొవ్వును తగ్గించడానికి సరైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. ఎక్కువగా ఫ్రూట్స్, ఆకుకూరలు, లీన్ ప్రోటీన్, తృణ ధాన్యాలు , ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఆహారాల పై దృష్టి పెట్టాలి. ఈ ఆహారాలు తీసుకుంటే శరీరంలో కెలరీల శాతాన్ని తగ్గించును. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ , షుగర్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. ఇవి శరీరంలో అధిక కెలరీలకు కారణమవుతాయి.

వ్యాయామాలు 

ప్రతీ రోజూ శారీరక శ్రమ చేస్తే శరీరంలో కేలరీలు తగ్గించడానికి సహాయపడును. వ్యాయామం, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ చేస్తే అధిక కెలరీలు బర్న్ చేయడం, కండరాళ్ళను దృడంగా చేయడం, జీవక్రియను మెరుగుపరచడానికి తోడ్పడును.

నాణ్యతమైన నిద్ర

నాణ్యతమైన నిద్ర పోవడానికి ప్రయత్నించాలి. నిద్రలేమి సమస్య వల్ల శరీరంలో హార్మోనల్ మార్పులు వస్తాయి. దీని వల్ల అధికంగా ఆకలి పెరగడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. ఇది పరోక్షంగా బరువు పెరగడానికి కారణమవుతుంది . రోజు 7-9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

స్ట్రెస్ ను నిర్వహించడం

ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పొత్తి కడుపు ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడానికి యోగ, శ్వాస వ్యాయామాలు, చేయాలి.

నిద్రకు ముందు ప్రాపర్ హైడ్రేషన్

నిద్రకు ముందు శరీర అవసరాలకు కావాల్సినంత నీళ్లు తాగాలి. దాని వల్ల శరీరంలో జీవక్రియకు సహాయపడును. కానీ పడుకునే ముందు మరీ ఎక్కువగా నీళ్లు తీసుకోవద్దు దాని వల్ల నిద్ర భంగం కలుగుతుంది. సరైన మోతాదులో తీసుకుంటే చాలు

Also Read: Morning Tips : ఉదయం బద్ధకంగా పడుకుంటున్నారా.. ఈ టిప్స్ తో మీ బద్ధకానికి చెక్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు