Vacation: 1 లక్ష బడ్జెట్ లో ఇంటర్నేషనల్ ట్రిప్స్.. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు..! విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ బడ్జెట్ గుర్తురాగానే వెనకడుగు వేస్తారు. అయితే కేవలం రూ.1లక్షతో సులభంగా సందర్శించే దేశాలు కొన్ని ఉన్నాయి. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, లావోస్,వియత్నాం. ఈ దేశాలను ఒక లక్ష బడ్జెట్ లో సందర్శించవచ్చు. By Archana 11 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Vacation: భారతదేశంలో ప్రయాణించడానికి అంత డబ్బు అవసరం లేదు. మీ ట్రిప్ కొన్ని వేల రూపాయలతో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ విదేశాల్లో ట్రిప్ ప్లానింగ్ విషయానికొస్తే.. లక్షలు ఖర్చుపెట్టి ప్రయాణం చేయాల్సి వస్తుందని అందరు వెనకడుగు వేస్తారు. అయితే చాలా తక్కువ ఖర్చుతో సందర్శించే దేశాలు కొన్ని ఉన్నాయి. ఈ దేశాలకు కేవలం రూ. 1 లక్షలో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. లక్ష రూపాయలు ఉంటే,ఈ దేశాలను సులభంగా సందర్శించవచ్చు. ఇండోనేషియా ఇండోనేషియా దేశంలో సందర్శించడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ దేవాలయాల నుంచి బీచ్‌లు , గుహల వరకు ప్రతిదీ ఉంటాయి. కావున ఇండోనేషియా ట్రిప్ ప్లాన్ చేస్తే.. వెళ్లడానికి, తిరిగి రావడానికి సుమారు రూ. 40-70 వేలు ఖర్చు అవుతుంది. ఇక ఇండోనేషియాలో జీవన అద్దె రూ.3 వేల నుంచి మొదలవుతుంది. కావున మీరు ఒక లక్షల్లో సులభంగా ఇక్కడకు వెళ్ళవచ్చు. థాయిలాండ్ సముద్రం, బీచ్‌లు ఎంజాయ్ చేయాలనుకుంటే థాయిలాండ్‌ని సందర్శించండి. ఇక్కడ ప్రయాణం ఖరీదైనది కాదు. థాయ్ లాండ్ వెళ్లాలంటే రూ.24-26 వేలకే ఫ్లైట్ లభిస్తుంది. అంతేకాకుండా, అక్కడ వసతి అద్దె కూడా రూ. 3,000 నుంచి ప్రారంభమవుతుంది. ఆహారం ధర 1100 రూపాయల నుంచి మొదలవుతుంది. కావున మీ జేబులో రూ. 1 లక్ష ఉంటే మీ థాయ్‌లాండ్ పర్యటన సులభంగా పూర్తవుతుంది. కంబోడియా కంబోడియాలోని అంగోక్వత్ దేవాలయం గురించి వినే ఉంటారు. ఈ పురాతన దేశాన్ని సందర్శించాలనుకుంటే. ఇక్కడ ప్రయాణానికి దాదాపు రూ. 41,500 నుంచి 48,500 వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఉండడానికి అద్దె రూ.4 వేలు, ఆహారం కూడా రూ.1 వేయి నుంచి మొదలవుతుంది. ఈ అందమైన దేశాన్ని అన్వేషించాలనుకుంటే కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే అవసరం. లావోస్ లావోస్ ఆసియాలోని ఒక చిన్న దేశం. అక్కడ ప్రకృతికి సంబంధించిన అనేక దృశ్యాలు కనిపిస్తాయి. ఈ దేశంలో ఆహారం, వసతి ఖర్చు దాదాపు రూ. 5 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడికి వెళ్లేందుకు దాదాపు రూ.40 నుంచి 65 వేల వరకు ఖర్చు అవుతుంది. వియత్నాం మీరు వియత్నాం సందర్శించాలనుకుంటే, విమాన ఛార్జీ రూ. 25,000 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, ఇక్కడ వసతి రూ. 2,000 నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆహారం కూడా చాలా చౌకగా ఉంటుంది. శ్రీలంక ప్రకృతి ప్రేమికులైన పర్యాటకులు మాత్రమే పొరుగు దేశం శ్రీలంకను సందర్శించడానికి వెళతారు. ప్రకృతి అందాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీలంకకు విమాన ఛార్జీ రూ.10 వేల నుంచి మొదలవుతుంది. అలాగే వసతి ఖర్చు రూ.4 వేలు. భోజనానికి రూ.1 వేయికి పైగా ఖర్చు అవుతుంది. టర్కీ లేదా టర్కీ చాలా అందమైన ఈ దేశాన్ని సందర్శించడానికి, విమాన ఛార్జీలు సుమారు 45 నుంచి 50 వేల వరకు ఉంటాయి. అలాగే ప్రతిరోజు వసతికి రూ.2500, భోజనానికి రూ.1000కు పైగా ఖర్చు అవుతుంది. కావున టర్కీ వంటి దేశానికి పర్యటనను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. Also Read: #SVC58: వెంకీ- అనిల్ మూవీ షూట్ మొదలైంది.. కోటి ఉమెన్స్ కాలేజీలో భారీ సెట్స్ - Rtvlive.com #international-trips-in-budget #international-trip-in-1-lakh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి