BREAKING: టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ మృతి..!

భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(Bishan Singh Bedi) కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు. దిగ్గజ స్పిన్నర్ 1967 -1979 మధ్య భారత్‌ తరపున 67 టెస్టులు ఆడి 266 వికెట్లు తీశాడు. 10 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు.

New Update
BREAKING: టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ మృతి..!

భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(Bishan Singh Bedi) కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు. దిగ్గజ స్పిన్నర్ 1967 -1979 మధ్య భారత్‌ తరపున 67 టెస్టులు ఆడి 266 వికెట్లు తీశాడు. 10 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఎరపల్లి ప్రసన్న, బీఎస్‌ చంద్రశేఖర్, ఎస్‌ వెంకటరాఘవన్‌లతో పాటు బేడీ భారత్‌ స్పిన్ బౌలింగ్‌ దశ, దిశను మార్చాడు. భారత్ తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించింది బిషన్‌సింగ్‌ బేడినే. 1975 ప్రపంచ కప్ మ్యాచ్‌లో అతని 12 ఓవర్లు వేసి కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ 12 ఓవర్లలో అతను ఏకంగా ఎనిమిది మెయిడిన్లు చేశాడు. ఒక్క వికెట్‌ కూడా తీశాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా తూర్పు ఆఫ్రికాను 120 స్కోరుకే పరిమితం చేసింది.

ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో 1,560 వికెట్లు తీసిన ఘనత బిషన్ సింగ్ బేడీది. 15ఏళ్ల వయసులోనే నార్తర్న్ పంజాబ్ తరపున బరిలోకి దిగాడు బేడి. అటు ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1974-75 రంజీ సీజన్‌లో బేడీ తన సత్తా ఏంటో చూపించాడు. ఆ సీజన్‌లో ఏకంగా 64 వికెట్లు తీసి అందరిచేత శభాష్‌ అనిపించుకున్నాడు. బేడీ బౌలింగ్‌ స్టైల్‌ చూడటానికి ఎంతో బాగుంటుంది. ఆయన బౌలింగ్‌ శైలీని సొగసైనదిగా అభివర్ణిస్తారు క్రికెట్ లవర్స్. చాలా రిలాక్స్‌గా బౌలింగ్‌ వేస్తున్నట్టు కనిపించే బేడీ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేవాడు.

1969లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో బిషన్‌సింగ్‌ బేడీ తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై 98/7 ఫిగర్స్‌ నమోదు చేశాడు. 1977-78లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 10/194 అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు రిజిస్టర్ చేశాడు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తర్వాత 1976లో బేడీ భారత కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. 1976 విండీస్‌పై సిరీస్‌లోని మూడో టెస్టు పోర్ట్-ఆఫ్-స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఆయనకు మొదటి టెస్టు విజయం దక్కింది. 16 జూన 1979లో శ్రీలంకపై చివరి వన్డే ఆడిన బేడీ.. ఆగస్టు 30, 1979లో ఇంగ్లండ్‌పై చివరి టెస్టు ఆడి కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

Also Read: రోహిత్ శర్మ వల్లే గెలుస్తున్నాం.. ఎందుకో తెలుసుకోండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు