Lava Yuva Star 4G: లావా కొత్త ఫోన్ లాంచ్, రూ.6499 కే గొప్ప ఫీచర్లు..

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా త్వరలో భారతీయ మార్కెట్ లో కొత్త 4జీ ఫోన్ లాంచ్ చేయనుంది. Lava Yuva Star 4G పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. రూ.6499 కే గొప్ప ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అవుతుండటం విశేషం.

New Update
Lava Yuva Star 4G: లావా కొత్త ఫోన్ లాంచ్, రూ.6499 కే గొప్ప ఫీచర్లు..

Lava Yuva Star 4G Launch In India: ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ మార్కెట్ లో కొత్త 4జీ ఫోన్ లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ రిటైల్ బాక్స్ కూడా బయటకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్పెసిఫికేషన్స్..

లావా యువా స్టార్ 4జీలో 6.75-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. లీక్ అయిన సమాచారం ప్రకారం, లావా యువా స్టార్ 4జీ డివైజ్ లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది. అయితే చిప్ పేరు ఇంకా తెలియదు. లావా యువా స్టార్ 4జీ డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది. లావా యువా స్టార్ 4జీలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.

సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. లావా యువా స్టార్ 4జీ లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఆప్షన్స్ ఉంటాయి. లావా యువా స్టార్ 4జీలో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ధర..
Lava Yuva Star 4G కేవలం రూ.6499కే గొప్ప ఫీచర్లతో లాంచ్ అవుతుండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్స్ లో అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు