/rtv/media/media_files/2025/10/28/muntha-cyclone-2025-10-28-12-09-55.jpg)
MUNTHA CYCLONE
Cyclone Montha Precautions: ప్రజలారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి - లేదంటే ప్రాణాలు పొతాయ్..!
MONTHA CYCLONE: ఏపీలో మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ ఇది మరింత ఉగ్రరూపం దాల్చనుంది. మరీ ముఖ్యంగా నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుంది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర తీరం వెంబడి 4.7 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడతాయని IMD, మINCOIS హెచ్చరించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ ఇది మరింత ఉగ్రరూపం దాల్చనుంది. మరీ ముఖ్యంగా నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుంది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర తీరం వెంబడి 4.7 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడతాయని IMD, మINCOIS హెచ్చరించాయి. తుఫాను సమీపిస్తున్న కొద్దీ కఠినమైన వాతావరణం, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపాయి.
ఇది నేడు (అక్టోబర్ 28) సాయంత్రం లేదా రాత్రి నాటికి కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల మేర వీస్తాయని.. గాలులు గంటకు 110 కిలోమీటర్ల వరకు ఉంటాయని అంచనా వేసింది. అందువల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతేనే గాని బయటకు రావద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదే సమయంలో మొంథా తుఫాను సమయంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులు ప్రజలకు అవగాహన చేస్తున్నారు.
Cyclone Montha Precautions
ప్రజలు ఎలాంటి రూమర్స్‌ను నమ్మవద్దు. ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు.
అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండండి.
వాతావరణ హెచ్చరికలు కోసం SMS లను గమనిస్తూ ఉండండి.
మీ భద్రత, మనుగడ కోసం అవసరమైన వస్తువులను (అత్యవసర వస్తు సామగ్రిని) సిద్ధం చేసుకోండి.
ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళండి.
మీ పత్రాలు/సర్టిఫికెట్స్, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు/కవర్‌లో ఉంచండి.
ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. అన్ని ఎలక్ట్రికల్ వస్తువులు, గ్యాస్ కనెక్షలను తీసివేయండి. తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.
మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుపాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకోండి.
పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు స్తంభాల కింద ఎప్పుడూ ఉండకండి.
పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయండి.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకండి.
అత్యవసర సహాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లను సంప్రదించండి.
- Oct 28, 2025 17:29 IST
Cyclone Montha
#CycloneMontha
— N Chandrababu Naidu (@ncbn) October 27, 2025
రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ… pic.twitter.com/VWD6dQUaxQ - Oct 28, 2025 17:28 IST
మొంథా తుఫాన్
నంద్యాల పై మొంథా తుఫాన్ ప్రభావం వల్ల ప్రజలను అప్రమత్తం చేసిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయ్యమయ్యాయన్న కమిషనర్ బండి శేషన్న
అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి రావాలీ ప్రజలను కోరిన మున్సిపల్ కమిషనర్ శేషన్న
డ్రైనేజీలు వర్షపు నీటితో నిండిపోయి ఉన్నాయి కనుక వాటిని ప్రాలదోలిస్తే సమస్య తీరుతుందని వార్డులలో పర్యటిస్తున్న కమిషనర్ బండి శేషన్న
- Oct 28, 2025 15:51 IST
'మొంథా' తుఫాన్ పై నర్సీపట్నం డిఎస్పీ పర్యటన.
తుపాన్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలను రక్షించేందుకు ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు పాయకరావుపేట చేరుకున్నాయి.
మొంథా'తుఫాన్ ప్రభావం దృష్ట్యా పాయకరావుపేట మండలంలో పలు గ్రామాల్లో నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు పర్యటించారు.
ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పర్యటించిన వారిలో నర్సీపట్నం డి.ఎస్.పీ,శ్రీనివాసరావు, పాయకరావుపేట సి.ఐ,అప్పన్న పోలీస్ సిబ్బంది,ప్రభుత్వ అధికారులు,స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
తీర ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించినఅధికారులు అత్యవసర పరిస్థితుల్లో తక్షణం సహాయక చర్యలు అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.
వాతావరణ మార్పులపై అధికారుల నుంచి సమాచారం అందిన వెంటనే ప్రజలు కుటుంబ సభ్యులతో సహా సురక్షిత ప్రాంతాలకు చేరాలని సూచించారు.
అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.
- Oct 28, 2025 14:26 IST
చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్..
రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న మొంథా తుఫాన్ నేపథ్యంలో నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కోరారు. ఈ మేరకు ఆయన నేడు వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల్ని…
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 28, 2025 - Oct 28, 2025 14:25 IST
నెల్లూరులో తూపాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
- Oct 28, 2025 14:24 IST
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్
- గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలిన తుపాన్
- ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 200 కిమీ, విశాఖపట్నంకి 290 కిమీ దూరంలో కేంద్రీకృతం
- ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం
- దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం
- కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు
- కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం
- ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి- ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.
- Oct 28, 2025 14:06 IST
అనకాపల్లి జిల్లాలో తుఫాన్ ప్రభావంతో అధికారులు అప్రమత్తం
అనకాపల్లి జిల్లాలో మొంద్ధా తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో జనజీవనానికి ఇబ్బందులు కలగలేదు జిల్లాలో వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఎన్డీఏఫ్ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్ విజయ్ కృష్ణ సమీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతా అనకాపల్లి జిల్లాలో కురిసిన వర్షాలు కారణంగా పెద్దగా పంట నష్టం జరగలేదని అధికారులు తెలుపుతున్నారు. తుఫాన్ తీవ్రత వలన విద్యుత్ అంతరాయం ఏర్పడితే సిబ్బంది ఎక్కడికి అక్కడే సబ్ స్టేషన్ల వారీగా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత పంట నష్టాలు అంచనా వేనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
- Oct 28, 2025 13:05 IST
ఏపీలో మొదలైన మొంథా తుఫాన్ ఎఫెక్ట్..
భయానకంగా సముద్రతీర ప్రాంతాలు..
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు..
ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు జోరుగా వానలు..
కోస్తా తీరాన్ని కమ్మేసిన కారుమబ్బులు..
అంతకంతకు పెరుగుతున్న ఈదురుగాలులు..
పలు ప్రాంతాల్లో తెగిపోతున్న రోడ్లు, కూలుతున్న చెట్లు, విద్యుత్ స్తంభాలు
- Oct 28, 2025 13:05 IST
అల్లకల్లోలంగా మచిలీపట్నం లోని మంగినపూడి బీచ్
30 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
అలెర్టైన పోలీసులు, అధికారులు
మంగినపూడి బీచ్ లో సందర్శకులకు అనుమతి నిరాకరణ
సముద్ర తీర ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు
అలల ఉధ్రుతి ద్రుష్ట్యా బీచ్ లో పోలీసుల గస్తీ
ఇళ్లనుంచి బయటకు రావొద్దని మైక్ ల ద్వారా అనౌన్స్ మెంట్ చేపిస్తున్న అధికారులు
- Oct 28, 2025 13:05 IST
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు, ఎస్పీ సతీష్ కుమార్ కు మంత్రి సవిత ఫోన్
* మొంథా తుఫాన్ తో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
* లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
* వైద్య, వ్యవసాయ శాఖ సిబ్బందిని క్షేత్ర స్థాయికి పంపాలన్న మంత్రి
* వర్షాలు, పంట నిల్వలపై రైతులకు అవగాహన కల్పించండి
* అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ తుఫాన్ నష్టాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశం
* జిల్లాలో తుఫాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారమివ్వండి
* ఫోన్లో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు, ఎస్పీ సతీష్ కుమార్ కు మంత్రి సవిత ఆదేశం
- Oct 28, 2025 12:40 IST
Cyclone Montha
మచిలీపట్నం 28.10.2025
మింథా తుపానును సమర్ధంగా ఎదుర్కొంటాం
⦁ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
⦁ ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించాం
⦁ విద్యుత్, రెవెన్యూ, హెల్త్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు
⦁ మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి తుపానుపై ప్రజల్ని అప్రమత్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర - Oct 28, 2025 12:39 IST
Cyclone Montha
ప్రకాశంజిల్లా, గిద్దలూరు:
- మొంధా తుఫాన్ ప్రభావంతో గిద్దలూరు పట్టణం, శ్రీనివాస థియేటర్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన స్థానిక శాసనసభ్యులు ముత్తుమూల అశోక్ రెడ్డి.
- వర్షాల కారంగా అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొన్న MLA.
- వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేసిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి.
- లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచన.
- తుఫాన్ ప్రభావం తగ్గమేతవరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారు.
గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమూల అశోక్ రెడ్డి కామెంట్స్. - Oct 28, 2025 12:22 IST
Cyclone Montha
⚠️ Safety Alert:
— Karl Marx2.O (@Marx2PointO) October 28, 2025
A python was spotted moving through the drainage beside houses in Vizag city amid heavy rains caused by Cyclone Montha. #CycloneMontha#Vizag#AndhraPradeshpic.twitter.com/N487DBnPv6 - Oct 28, 2025 12:21 IST
బిగ్ బ్రేకింగ్...🚨🚨🚨
- ముందుకొచ్చిన అంతర్వేది సముద్రం
- భారీగా ఎగిసిపడుతున్న అలలు
- గోదావరి, సముద్రం కలిసే ప్రాంతం అన్న చెల్లెళ్ళు గట్టు వద్ద భయాందోళన పరిస్థితులు
- అలలు ఉధృతికి కొట్టుకుపోయిన లైట్ హౌస్ రిటైనింగ్ వాల్
- సముద్ర తీర ప్రాంతం వద్ద భయానక పరిస్థితులు
- నిమిషం నిమిషంకు ముందుకు వస్తున్న సముద్రం
- పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న అలలు
- Oct 28, 2025 12:20 IST
Cyclone Montha
మొంథా తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఈ రోజు చాలా ముఖ్యమని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు సూచించిన మంత్రి లోకేష్
- Oct 28, 2025 12:19 IST
Cyclone Montha
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రతపై క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీసిన మంత్రి నారా లోకేష్. వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి క్షేతస్థాయి పరిస్థితులను వాకబు చేసిన మంత్రి నారా లోకేష్
- Oct 28, 2025 12:18 IST
Cyclone Montha
నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల తీర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 గంటల వరకు వర్షాలు మోస్తరు నుండి భారీగా ఉంటాయి. ఆ తర్వాత, వర్షాలు బాపట్ల - కృష్ణా జిల్లా ప్రాంతాల వైపు మారుతాయి.
- Oct 28, 2025 12:18 IST
Cyclone Montha
అమరావతి: తీవ్ర తుఫాను ‘మొంథా’నెమ్మదిగా కోనసీమ జిల్లా వైపు కదులుతూ, నెల్లూరు - ప్రకాశం తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో భారీ వర్షాలను కురిపిస్తోంది.

Follow Us