/rtv/media/media_files/2025/11/11/jubilee-hills-by-poll-2025-2025-11-11-06-49-27.jpg)
Jubilee Hills By Poll 2025
🔴Jubilee Hills By Poll 2025 Live Updates:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు (EVM), వీవీ ప్యాట్ యంత్రాలతో తమ తమ బూత్‌లకు వెళ్లారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు, ఉదయం 7 గంటల నుంచి అధికారికంగా ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు ఓటింగ్ జరగనుంది. యూసఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుండి అన్ని ప్రాంతాలకు పోలింగ్ మెటీరియల్ పంపిణీ పూర్తయింది. మొత్తం 5 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు.
ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. దొంగ ఓట్లు, గొడవలు జరుగకుండా అధికారులు కఠిన నిఘా పెట్టారు. డ్రోన్ల ద్వారా భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఈవీఎం యంత్రాలు పనిచేయకపోతే వెంటనే బ్యాకప్ యంత్రాలను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల అధికారులు తెలిపారు.
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,000 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. రిజర్వ్ సిబ్బందితో కలిపి సంఖ్య 2,394కి చేరింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో రౌడీషీటర్లను బైండోవర్ చేసి శాంతిభద్రతలు కాపాడే చర్యలు తీసుకున్నారు. ఎవరైనా దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
జీహెచ్‌ఎంసీ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద పారిశుధ్య పనులు పూర్తి చేశారు. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద వసతులను పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు చేయించారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల వరకు సున్నపు గీతలు వేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ వివరాలు:
- మొత్తం ఓటర్లు: 4,01,635
- పురుషులు: 2,08,561
- మహిళలు: 1,92,779
- ఇతరులు: 25
- పోలింగ్ కేంద్రాలు: 407
- సమస్యాత్మక కేంద్రాలు: 226
- పోలింగ్ సిబ్బంది: 2,060
- పోలీసు సిబ్బంది (రిజర్వ్‌తో కలుపుకొని): 2,394
- బ్యాలెట్ యూనిట్లు: 561
- వీవీ ప్యాట్ యంత్రాలు: 595
- పోటీదారులు: 58
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్య పండుగకు రంగం సిద్ధమైంది. అధికారులు, పోలీసు బలగాలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధంగా ఉంది.
- Nov 11, 2025 18:20 IST
JUBILEE HILLS OPINIOIN POLL AND EXIT POLL SURVEY REPORT
- Nov 11, 2025 18:15 IST
జూబ్లీహిల్స్ లో హైటెన్షన్.. సునీత ధర్నా.. పోలీసుల లాఠీ ఛార్జ్!
- Nov 11, 2025 17:29 IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 45.50 శాతం ఓటింగ్ నమోదు
- Nov 11, 2025 13:26 IST
బోరబండలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్
- Nov 11, 2025 12:47 IST
Jubilee Hills By Poll 2025: పోలింగ్ బూత్ల వద్ద కొత్త ఓటర్ల సందడి..
కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న కొత్త ఓటర్లు
- Nov 11, 2025 12:20 IST
Jubilee Hills By Poll 2025
ఓటు హక్కు వినియోగించుకోండి- రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్.వి కర్ణన్
- Nov 11, 2025 11:51 IST
Jubilee Hills By Poll 2025: మాకు ఇంట్రెస్ట్ లేదు.. సారీ! పోలింగ్‌పై ఓటర్లు నిరాశక్తి
- Nov 11, 2025 11:06 IST
Jubilee Hills By Poll 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో వెంగళరావునగర్‌లో డబ్బు పంపిణీ ఆరోపణలు, తోపులాటతో కలకలం రేగింది. బూత్ 205, జవహర్ నగర్ వద్ద ఓ నాయకుడు డబ్బులు పంచుతూ తిరుగుతుండగా, ప్రతిపక్షాల కార్యకర్తలు అతడిని పరిగెత్తించి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆ నాయకుడిని అధికారులకు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణల కారణంగా ఉద్రిక్తత కొనసాగుతోంది.
- Nov 11, 2025 10:57 IST
Jubilee Hills By Poll 2025: ఓటేసిన నవీన్ యాదవ్..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించారు. యూసుఫ్‌గూడ పోలింగ్ కేంద్రానికి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో కలిసి వెళ్లి ఓటేశారు.
- Nov 11, 2025 10:36 IST
Jubilee Hills By Poll 2025: ఓటు హక్కును వినియోగించుకున్న నటుడు తనికెళ్ల భరణి.
- Nov 11, 2025 10:34 IST
Jubilee Hills By Poll 2025: షేక్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదం..
కాంగ్రెస్ పార్టీ షేక్ పేట్ డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదం..
— HEMA NIDADHANA (@Hema_Journo) November 11, 2025
BRS డివిజన్ నాయకులను లోపలికి అనునతిస్తున్నారు అంటూ ఆరోపణలు.. pic.twitter.com/A4nqBSxWtm - Nov 11, 2025 10:33 IST
Jubilee Hills By Poll 2025: బోరబండ స్వరాజ్‌నగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పర్యటన
- Nov 11, 2025 09:39 IST
Jubilee Hills By Poll 2025: డ్రోన్ మానిటరింగ్..
రహమత్ నగర్, బోరబండ, శ్రీరామ్ నగర్, యూసుఫ్ గూడా వంటి సున్నిత ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ల సాయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రహమత్ నగర్‌లోని 74 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా డ్రోన్ మానిటరింగ్ కొనసాగుతోంది.
- Nov 11, 2025 08:56 IST
Jubilee Hills By Poll 2025: బోరబండలో 'టీ-షర్టుల' వార్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రెహమత్‌నగర్‌లోని బూత్ 165లో మొరాయించిన ఈవీఎంను అధికారులు మరమ్మతు చేశారు. దీంతో 40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు, బోరబండ డివిజన్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు టీ-షర్టులు వేసుకుని ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి.
- Nov 11, 2025 08:50 IST
Jubilee Hills By Poll 2025: దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్..
- జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు డ్రోన్లతో అనుసంధానం
- దేశంలో మొదటిసారి ఎన్నికల్లో డ్రోన్స్ ఉపయోగం..
- పోలింగ్ బూత్ల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణ
- ఎప్పటికప్పుడు డ్రోన్ విజ్యువల్స్‌ను పర్యవేక్షిస్తున్న సిబ్బంది..
- ప్రతి పోలింగ్ లొకేషన్‌కి ఒక డ్రోన్.. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 139 డ్రోన్లు..
- డ్రోన్లు ఎగిరేయడానికి DGCA, లోకల్ పోలీసుల నుంచి పెర్మిషన్ తీసుకున్న ఎన్నికల అధికారులు.
- Nov 11, 2025 08:31 IST
Jubilee Hills By Poll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓటు వేశారు.
#WATCH | तेलंगाना: फिल्म निर्देशक एस.एस. राजामौली ने जुबली हिल्स उपचुनाव के तहत मतदान किया। pic.twitter.com/lOT0BQIfZm
— ANI_HindiNews (@AHindinews) November 11, 2025 - Nov 11, 2025 08:29 IST
Jubilee Hills By Poll 2025: నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓటేయండి : నవీన్ యాదవ్
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ యూసుఫ్‌గూడ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం 10-15 శాతం పెరిగి 65 శాతానికి పైగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఓటు వేయడానికి యువత ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం ఓటర్లంతా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నవీన్ పిలుపునిచ్చారు.
- Nov 11, 2025 08:15 IST
Jubilee Hills By Poll 2025: పోలింగ్ ప్రశాంతం: ఆర్వో కర్ణన్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కర్ణన్ తెలిపారు. తొలుత 11 ప్రాంతాల్లో ఈవీఎంల సమస్య తలెత్తినా, వెంటనే రిజర్వ్ ఈవీఎంలను తీసుకువచ్చి రీప్లేస్ చేసినట్లు ఆయన వివరించారు. ఓటర్లందరూ ఎలాంటి ఆందోళన చెందకుండా పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
- Nov 11, 2025 08:10 IST
Jubilee Hills By Poll 2025: జూబ్లీహిల్స్ పోలింగ్‌లో ఉద్రిక్తత..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా షేక్‌పేట డివిజన్‌లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేత సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్ ఏజెంట్‌లను బూత్‌లోకి పంపి, తనను అడ్డుకున్నారని ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
- Nov 11, 2025 08:05 IST
Jubilee Hills By Poll 2025
రహమత్‌నగర్‌లో మొదలు కాని పోలింగ్!
- Nov 11, 2025 08:04 IST
Jubilee Hills By Poll 2025
ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, M.M కీరవాణి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
#ElectionsWithHT | #Oscar-winning music composer and Padma Shri awardee, #MMKeeravani casts his vote at a polling booth in Jubilee Hills, #Hyderabad
— Hindustan Times (@htTweets) May 13, 2024
Track LIVE updates on #LokSabhaElections2024https://t.co/hymBbHzw7M#Elections2024
📹 ANI pic.twitter.com/oTKnhJbCvC - Nov 11, 2025 07:56 IST
Jubilee Hills By Poll 2025
పవర్ కట్ తో నాగార్జున కమ్యూనిటీ కాలనీలో ఓటర్లకు తీవ్ర ఇబ్బంది.
- Nov 11, 2025 07:53 IST
Jubilee Hills By Poll 2025
శ్రీనగర్ కాలనీలో నిలిచిన పోలింగ్..
- Nov 11, 2025 07:22 IST
Jubilee Hills By Poll 2025
139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు..
- Nov 11, 2025 07:22 IST
Jubilee Hills By Poll 2025
- 5 వేల మంది సిబ్బందితో ఓటింగ్ నిర్వహణ..
- Nov 11, 2025 07:21 IST
Jubilee Hills By Poll 2025
- ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది..
- Nov 11, 2025 07:18 IST
Jubilee Hills By Poll 2025
జూబ్లీహిల్స్‌లో ఈసారి పోలింగ్ శాతం ఫలితాలపై గట్టి ప్రభావం చూపనుంది. గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగానే నమోదైంది. 2014లో 50.18%, 2018లో 45.59%, 2023లో 47.58% ఓటింగ్ జరిగింది.
- Nov 11, 2025 07:14 IST
Jubilee Hills By Poll 2025
జూబ్లీహిల్స్ నియోజకవర్గ వివరాలు:
- మొత్తం ఓటర్లు: 4,01,635
- పురుషులు: 2,08,561
- మహిళలు: 1,92,779
- ఇతరులు: 25
- పోలింగ్ కేంద్రాలు: 407
- సమస్యాత్మక కేంద్రాలు: 226
- పోలింగ్ సిబ్బంది: 2,060
- పోలీసు సిబ్బంది (రిజర్వ్‌తో కలుపుకొని): 2,394
- బ్యాలెట్ యూనిట్లు: 561
- వీవీ ప్యాట్ యంత్రాలు: 595
- పోటీదారులు: 58
- Nov 11, 2025 07:12 IST
Jubilee Hills By Poll 2025
పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్
- Nov 11, 2025 07:11 IST
జూబ్లీహిల్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం..

Follow Us