Wedding Special : నగల్లోనూ సరికొత్త ట్రెండ్..చోకర్ -నెక్లెస్తో నయా లుక్..! పెళ్లి కానీ..పేరంటమూ కానీ..ఏ చిన్న ఫంక్షన్ అయినా మెడ నిండా నగలు వెసుకుంటే ఆ అందమే వేరు. అందుకోసమే పొడవాటి హారానికి జతగా మెడ వరకూ మాత్రమే ఉండే నెక్లెస్ కానీ చోకర్ కానీ పెట్టుకుంటే..అబ్బ ఎంత అందంగా ఉంటామో. ఇప్పుడు చోకర్-నెక్లెస్ ట్రెండ్ నడుస్తోంది. By Bhoomi 27 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Wedding Special : పెళ్లిలు కావచ్చు, పేరంటాలు కావచ్చు..చిన్న చిన్న ఫంక్షన్లు ఏవైనా సరే మెడనిండా నగలు ధరిస్తే..ఆ అందాన్ని వర్ణించలేము. ఈ మధ్య కాలంలో పొడవాటి నగలకు పొట్టి నగలను జత చేస్తూ వేసుకుంటున్నారు. ఎప్పుడూ ఒకే శైలిని అనుసరించాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. ముఖ్యంగా మగువలకు ఎప్పుడూ ఒకే నగ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. డిజైనర్లు..ఇప్పుడు భిన్నంగా చోకర్ కు జోడిగా సెట్ చేసి మగువల సోయగాన్ని మరింత రెట్టింపు చేస్తున్నారు. వీటిలో అచ్చంగా బంగారంతో చేసినవే కాదు..పోల్కీ, కుందన్స్, ముత్యాలు, పచ్చలూ వీటన్నింటిని కలగలిపినవీ, టెంపుల్ డిజైన్లు, నవరత్నాలు సెట్లు..ఇలా ఒకటేమిటి ఎన్నోన్నో రకాలను మ్యాచ్ చేసి మెరిపోయేలా అందంగా డిజైన్ చేస్తున్నారు. చోకర్, నెక్లెస్ కలిపి ఈ సెట్లను పెట్టుకుంటే ఆధునికంగానే కాదు..అందంగానూ కనిపిస్తారు. ఈ తరం అమ్మాయిలు వీటిని ఎంతో ఇష్టపడుతున్నారు. చీర , లెహెంగా, లాంగ్ ఫ్రాక్, హాఫ్ సారీ ఇలా దేనిమీదికైనా చక్కగా అమరిపోతున్న వీటిని వేసుకుని సంబరపడుతున్నారు. అలాంటి వాటిని మీరు చూస్తే ఖచ్చితంగా మనసు పారేసుకుంటారు. నగల్లోనూ సరికొత్త ట్రెండ్..చోకర్ -నెక్లెస్తో నయా లుక్ నగల్లోనూ సరికొత్త ట్రెండ్..చోకర్ -నెక్లెస్తో నయా లుక్ నగల్లోనూ సరికొత్త ట్రెండ్..చోకర్ -నెక్లెస్తో నయా లుక్ #women-news #choker #wedding-special మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి