KVS : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే...

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్‌) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఒకటో తరగతిలో చేరాలనుకునే విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి

KVS : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే...
New Update

KVS Online Notification : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Central Schools) 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఒకటో తరగతిలో చేరాలనుకునే విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి సోమవారం నుంచి (ఏప్రిల్‌1) నుంచి ఆన్‌ లైనల్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ప్రవేశాలు ప్రారంభం అవుతున్నాయి.అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకటో తరగతి అడ్మిషన్‌ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి...మిగతా తరగతుల అడ్మిషన్లకు కూడా వయోపరిమితి నిబంధనలు వర్తిస్తాయి.

ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే స్టూడెంట్స్‌ కు ఎంట్రన్స్ ఎగ్జామ్‌, కొన్ని రిజర్వేషన్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్లను కేటాయిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లు కంటే ఎక్కువ దరఖాస్తులు కానీ వచ్చినట్లయితే ప్రవేశాలను లాటరీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

అయితే 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది. ఏం సబ్జెక్ట్స్‌ ఉంటాయి.. ఎన్ని మార్కులు అనే దానికి సంబంధించిన వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. తొలి లిస్ట్‌ను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న రిలీజ్‌ చేయనున్నారు. ఈ మూడు జాబితాల ద్వారా ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

కేవీల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతికి తప్ప) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి సెలక్ట్‌ అయిన వారి లిస్ట్‌ను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు...

11వ తరగతి అడ్మిషన్ల కోసం..

అలాగే.. 11వ తరగతి తప్ప మిగతా క్లాస్‌ల వారి అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాల కోసం పదో తరగతి రిజల్ట్‌(10th Class Results) కోసం వేచి ఉండాలి. పదవ తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత 10 రోజుల్లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. 11వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ముందుగా కేవీ విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అప్లై చేసుకునే సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని కేవీఎస్‌ వెల్లడించింది...

ముఖ్యమైన తేదీలు :

ఫుల్‌ నోటిఫికేషన్‌ విడుదల : మార్చి 31, 2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 1, 2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్‌ 15, 2024

ఎంపికైన అభ్యర్థుల జాబితా రిలీజ్‌: ఏప్రిల్‌ 19, 2024

Also Read : గుండెపోటు కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే!

#kvs-online-notification #10th-class-results #central-schools
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe