kurnool YCP Candidate Retired IAS Imtiaz: కర్నూల్ వైసీపీ అభ్యర్థి, రిటైర్డ్ IAS ఇంతియాజ్ ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు. తాను పుట్టి పెరిగింది కర్నూల్ లోనే అన్నారు. చదువు కూడా కర్నూలు లోనే అని చెప్పుకొచ్చారు. తాను లోకల్ అని.. నాన్ లోకల్ కాదని వెల్లడించారు. IASగా తన పని విధానం చూసిన జగన్ కర్నూల్ లో పోటీ చేయమని చెప్పారన్నారు. అభివృద్ధి సంక్షేమతో పాటు కర్నూలు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా నిర్మించడం తన లక్ష్యం అన్నారు.
Also Read: పాపం పవన్ కళ్యాణ్.. జనసేనకు ఎందుకు సీట్లు తగ్గించారు.. : అమర్‌నాథ్
ఇంతియాజ్ స్వగ్రామం కర్నూలు జిల్లా కోడుమూరు. సెర్ప్ సీఈఓగా, సీసీఎల్ ఏ సెక్రటరీ గా, మైనార్టీ వెల్ఫేర్ సీఈఓ గా ఇంతియాజ్ అహ్మద్ పని చేశారు. అయితే, తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వైసీపీలో చేరారు. అనంతరం కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ను సీఎం జగన్ ప్రకటించారు.
Also Read: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. లైవ్ లో ఫోన్ కాల్స్ వినిపించిన భర్త..!
వచ్చే ఎన్నికల్లో సంజీవ కుమార్‌ను పక్కన పెట్టిన జగన్ ఇదే నియోజకవర్గం నుంచి ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు అవకాశం కల్పించారు. అయితే, ఆయన అందుకు నిరాకరించి టీడీపీలో చేరారు. దీంతో కర్నూలు వైసీపీ స్థానం ఖాలీ అయింది. ఇక ఏ దారి లేకపోవడంతో ఇంతియాజ్‌కు అవకాశం కల్పించారు. ఇలా కర్నూల్ పార్లమెంట్ వైసీపీ టికెట్ రిటైర్డ్ IAS ఇంతియాజ్ కు కల్పించడంతో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.