ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారంటూ గులాబీ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించిన ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని.. దేవగౌడ కొడుకు ఎన్డీయేలో చేరినప్పుడు మోదీకి రాజరికం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు కేటీఆర్. జైషా ఎవరు..? అయనకు బీసీసీఐ పదవి ఎలా వచ్చిందని నిలదీశారు. మోదీతో చేరేందుకు మాకేం పిచ్చికుక్క కరవలేదని.. మోదీ చెప్పే అబద్దాలు చిన్నపిల్లలు కూడా నమ్మరన్నారు కేటీఆర్. మేం గుజరాత్ గులామ్‌లం కాదు.. ఢిల్లీకి బానిసలం కాదని ఫైర్ అయ్యారు. మోదీ అబద్దాలకు ఇక్కడ ఎవరూ భయపడరని కౌంటర్ వేశారు కేటీఆర్.
కేటీఆర్ ఇంకేం అన్నారంటే?
➼ మోదీ ఎంత గొంతు చించుకున్నా అబద్దాలు నిజం కావు-కేటీఆర్
➼ మోదీ దగుల్‌బాజీ మాటలు దేశంలో ఎవరూ నమ్మరు
➼ మోదీ ఎప్పుడో ఒకసారి రాష్ట్రానికి టూరిస్ట్‌లా వచ్చి అడ్డమైన చెత్తా వాగి పోతారు
➼ నేను సీఎం కావాలంటే మోదీ పర్మిషన్ ఎందుకు?
➼ తెలంగాణ ఎమ్మెల్యేలు.. ప్రజలు అనుకుంటే నేను సీఎం అవుతా-కేటీఆర్
➼ ఈ మాత్రం సోయ కూడా ప్రధానికి లేదా?
➼ మోదీ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ సర్కార్‌కు లేదు
➼ కేసీఆర్ ఫైటర్, చీటర్‌తో కలిసి పని చేయరు -కేటీఆర్
➼ మోదీ ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడారు -కేటీఆర్
➼ మోదీ నుంచి NOC తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు -కేటీఆర్
➼ ఈ సారి 110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతు ఛాలెంజ్ చేస్తున్నా -కేటీఆర్
➼ మీరు పొత్తు పెట్టుకుంటే రాచరికాలు గుర్తుకురావా?-కేటీఆర్
➼ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నప్పుడు లోకేశ్ మంత్రేగా...?
➼ అప్పుడు రాజు, యువరాజులు గుర్తుకు రావా? -కేటీఆర్
➼ ప్రధాని మోదీ పచ్చి అబద్ధాల కోరు -కేటీఆర్
➼ ఒకవైపు పార్టీలన్నీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మేము NDA తో ఎందుకు వెళ్తాం?
➼ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న హేమంత్ బిశ్వశర్మ పైన ఉన్న కేసు మీ పార్టీలో చేరినాక ఏమైంది?
➼ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి, మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా ఎవరు..? జైషా ఎవరో, అనురాగ్ ఠాకూర్ ఎవరో చెప్పాలి
➼ రెండుసార్లు మేము ప్రజాస్వామికంగా ప్రజలల్లో గెలిచిన వ్యక్తులం
➼ గుండెలు చించుకొని అరిసినంత మాత్రానా అబద్ధాలు నిజం అయిపోవు
➼ తెలంగాణ ప్రజలు మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఎన్నుకోవడానినికి రెడీ ఉన్నారు
➼ ఎన్ని అబద్ధాలు చెప్పినా బిజెపిని తెలంగాణ ప్రజలు పట్టించుకోరు
➼ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో పొలిటికల్ టూరిస్టులైన బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలకు వివరించాలి
➼ ప్రధానమంత్రి నీతిమంతునన్ని మాట్లాడుతారు. మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీని అధాని విషయంలో ఎందుకు వేయలేరు. ఈ విషయంలో ఎందుకు వెనక్కి వెళ్లారు?
➼ శ్రీలంక ప్రధాన మంత్రితో 6,000 కోట్ల అదాని కాంట్రాక్ట్ గురించి మాట్లాడిన ప్రధానమంత్రి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయకుండా ఎందుకు ఆగారు?
➼ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా... ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడిన... తెలంగాణ ప్రజలకు 9 సంవత్సరాలలో బిజెపి ఏమి చేయలేదని అందరికీ తెలుసు
➼ తెలంగాణ రాష్ట్రానికి చేసింది గుండు సున్న.. మీకు వచ్చేస్థానాలు కూడా గుండు సున్నా
మోదీ ఏం అన్నారంటే?
ఇందూరు జనగర్జన సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్డీఏలో చేర్చుకోవాలని అభ్యర్థించారని ఆరోపించారు మోదీ. అయితే కేసీఆర్ చేసిన పనుల వల్ల ఆయనతో కలిసి ఉండలేకపోయానని చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలిచినప్పుడు కేసీఆర్‌కు మద్దతు అవసరమన్నారు. ఈ ఎన్నికలకు ముందు ఎయిర్ పోర్టులో తనకు స్వాగతం పలికేవారని, కానీ ఆ తర్వాత హఠాత్తుగా ఆ పని మానేశారన్నారు మోదీ.
ALSO READ: బండారు బూతులపై రోజా కంట తడి..వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి!