KTR: నిరుపేద విద్యార్థిని చదువుకు కేటీఆర్ సాయం KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఓ నిరుపేద విద్యార్థిని చదువు కోసం చేయూతనిచ్చారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన అన్నపూర్ణ అనే మహిళకు తన కూతురి చదువు కోసం రూ. లక్ష ఆర్థికసాయం అందించారు. By Naren Kumar 24 Dec 2023 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఓ నిరుపేద విద్యార్థిని చదువు కోసం చేయూతనిచ్చారు. ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన అన్నపూర్ణ అనే మహిళకు తన కూతురి చదువు కోసం రూ. లక్ష ఆర్థికసాయం అందించారు. ఇల్లెందు పట్టణం ఆజాద్ నగర్‌కు చెందిన అన్నపూర్ణ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో కూతురిని చదివించుకోలేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సాయం కోసం తెలంగాణ భవన్‌కు వెళ్లగా ఆమెను కలిసి సమస్యలు తెలుసుకున్న కేటీఆర్.. ఆ కుటుంబ పరిస్థితి విని చలించారు. ఆమె కూతురి చదువు కోసం వెంటనే వ్యక్తిగత సాయంగా రూ. లక్ష అందించారు. అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: KTR: కాంగ్రెస్ శ్వేతపత్రం తప్పుల తడక.. అబద్ధాల పుట్ట : కేటీఆర్ స్వేదపత్రం లైవ్ అయితే తాను ప్రజాదర్బార్ లో 4 దరఖాస్తులు సమర్పించానని, అక్కడ పనికాక ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించినా వీలు కాలేదని అన్నపూర్ణ చెప్పారు. తమకు అండగా నిలిచిన కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ సాయం వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసి అభినందిస్తున్నారు. ప్రజా దర్బార్ పొమ్మంటే తెలంగాణ పార్టీ ఆదుకుంది ఇల్లందు అన్నపూర్ణకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ప్రజల కష్ట సుఖాలు వింటాము, అండగా నిలబడతామంటూ అధికారం అందిన వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది.… pic.twitter.com/fdT1gB73nT — BRS Party (@BRSparty) December 24, 2023 #ktr #illendu-annapurna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి