PV Narasimharao: మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన గొప్ప దార్శనికుడు పీవీ నర్సింహ రావు అని కొనియాడారు.
ఇది కూడా చదవండి: సిమ్ కార్డులు కొంటున్నారా.. జాగ్రత్త! ఇతడికి ఏం జరిగిందో చూడండి..
పీవీ నరసింహారావు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన దేశాన్ని ఒడ్డుకు తెచ్చారన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారని, భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని అన్నారు. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని, ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. పీవీ సంస్కరణలు ఎప్పటికీ ఆచరణీయమని పేర్కొన్నారు.