Krishna Mukunda Murari: కృష్ణ డల్ గా ఉండడం గమనించిన అత్తా రేవతి ఏమైందని అడుగుతుంది. దీంతో కృష్ణ మీ అబ్బాయి మందు తాగి నన్ను కొట్టాడు అని చెబుతుంది. మురారి కొట్టాడని చెప్పడంతో.. ఎందుకు కొట్టావని గడ్డి పెడుతుంది రేవతి. కృష్ణ కోపంగా రూమ్ లోకి వెళ్తుంది.
రూమ్ లోకి వెళ్లిన ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మురారి.. నేను నిన్ను కొట్టానని మా అమ్మతో అబద్దం ఎందుకు చెప్పవని కృష్ణ పై అరుస్తాడు. దీంతో కృష్ణ.. ముకుంద వల్ల డల్ గా ఉన్నానని చెప్పలేను కదా.. అందుకే ఇలా డైవర్ట్ చేశాను అని చెప్తుంది.
ఇక శోభనం గదిలో ముకుంద నిజం చెప్పేస్తే.. ఆదర్శ్ పరిస్థితి ఏంటీ అని టెన్షన్ పడుతుంటారు కృష్ణ, మురారి. ఒక అమ్మాయి శోభనం గదిలో.. భర్త అంటే ఇష్టం లేదని మొహం చెప్తే ఎవరూ తట్టుకోలేరు. ఒకవేళ నిజం తెలిసిపోయి ఆదర్శ్ ఏమైనా చేసుకుంటే అని భయపడుతుంది కృష్ణ.
ఆదర్శ్ తో శోభనం ఇష్టంలేని ముకుంద శోభనం ఎలా క్యాన్సిల్ చేయాలనీ ఆలోచిస్తూ ఉంటుంది. మురారితో శోభనం అయితే.. అందంగా అప్సరసలా రెడీ అయ్యేదాన్ని. ఏం పాపం చేసుకున్నానో నాకు ఈ ఖర్మ పట్టింది అని మనసులో అనుకుంటుంది ముకుంద.
మరో వైపు భార్యతో శోభనం గురించి కలలు కంటూ ఉంటాడు ఆదర్శ్. ఇంతలో అక్కడికి వచ్చిన మురారి శోభనం క్యాన్సిల్ చేయడానికి ఆదర్శ్ ను కన్విన్స్ చేయాలని ట్రై చేస్తాడు.
కానీ మురారి ఏం మాట్లాడకముందే.. ముకుందకు కాలి నొప్పనీ.. శోభనం క్యాన్సిల్ చేయడానికి రాలేదు కదా అంటాడు ఆదర్శ్. దీంతో ముకుంద పై ఆదర్శ్ పెంచుకున్న ప్రేమను గమనించిన మురారి.. శోభనం క్యాన్సిల్ చేయాలని చెప్పలేకపోతాడు. తిరిగి వెళ్ళిపోతాడు.
మురారి రాగానే.. శోభనం క్యాన్సిల్ చేయడం గురించి ఆదర్శ్ తో చెప్పారా ..? అని అడుగుతుంది కృష్ణ. దీంతో మురారి.. ముకుందతో ఒకటవ్వాలనే ఆదర్శ్ ఆనందం చూసి చెప్పలేకపోయానని నిరాశగా మాట్లాడతాడు మురారి. మరి ఇప్పుడు శోభనం జరిగితే ఆదర్శ్ పరిస్థితి ఏంటీ అని టెన్షన్ పడుతుంది కృష్ణ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Multi Starrer Movie: వావ్..! మరో క్రేజీ కాంబో.. మల్టీ స్టారర్ కు సిద్దమైన యంగ్ హీరోస