గెలిచేది కాంగ్రెస్ పార్టీనే.. నాకూ సీఎం అయ్యే చాన్స్ వుంది..

డిసెంబర్‌ 3న తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయేనని ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయిన్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తేల్చేశారు. తదనంతరం మా నలుగురిలో ఎవరికైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు విసుగు చెందారని.. కేసీఆర్‌ ఇక విశ్రాంతి తీసుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఊసే లేదని, ఆ పార్టీ ఒక్క స్థానంలో గెలవడం కూడా కష్టమేనన్నారు.

గెలిచేది కాంగ్రెస్ పార్టీనే.. నాకూ సీఎం అయ్యే చాన్స్ వుంది..
New Update

డిసెంబర్‌ 3న తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీయేనని ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయిన్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తేల్చేశారు. తదనంతరం మా నలుగురిలో ఎవరికైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కోమటిరెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్‌ 70కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతుందని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు విసుగు చెందారని.. కేసీఆర్‌ ఇక విశ్రాంతి తీసుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఊసే లేదని, ఆ పార్టీ ఒక్క స్థానంలో గెలవడం కూడా కష్టమేనన్నారు.

16న కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా

త్వరలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని.. ఈ నెల 16న మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రియాంక గాంధీ పర్యటన తర్వాత మిగిలిన అన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. పులి బయటకు వస్తోంది.. ఇక చూసుకుందాం అన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులి బయటకు వచ్చినా ఇక్కడ చేసేదేమీ లేదన్నారు. పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు జేసి కేసీఆర్‌ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతి గ్రామంలో ఇళ్లు ఇచ్చామని.. ప్రస్తతుం ఒక్క గ్రామంలో కూడా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికలకు ముందు సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు ఇస్తామంటున్నరని.. వారి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. దళితబంధు, బీసీ బంధు ఇవన్నీ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే తప్ప పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు చూసి కేసీఆర్‌కు దిమ్మతిరిగి జ్వరమొచ్చి నెల రోజులుగా లేస్తలేడని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ గ్యారెంటీలతో కర్ణాటకలో మోడీనే మట్టికరిపించామని.. ఆయన కంటే ఈయన పెద్ద పులా? అని ప్రశ్నించారు.

హరీశ్ రావు, కేటీఆర్ లకు ఓటమి భయం..

కాంగ్రెస్‌ నేతలు వృద్ధ సింహాలు అన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మేము వృద్ధ సింహాలు అయితే.. మరి మాకంటే పెద్దయిన కేసీఆర్‌ని ఏమనాలె అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రజలెవరూ నమ్మరన్నారు. 24 గంటల కరెంటు పచ్చి అబద్ధమని, ఎక్కడ వస్తుందో చూపించాలె అని మండిపడ్డారు. 24 గంటల కరెంట్‌ నిరూపిస్తే ఎమ్మెల్యేగా పోటీ నుంచి తప్పుకుంటానని.. కేటీఆర్‌కు మరోసారి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. హరీశ్‌ రావు, కేటీఆర్‌లకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ పదేళ్లలో కేసీఆర్‌ కుటుంబం బంగారం అయింది తప్ప బంగారు తెలంగాణ రాలేదని, సామాన్యుల బతుకులు మారలేదని తెలిపారు. బతుకు తెలంగాణ కావాలన్నదే తన ధ్యేయమని కోమటిరెడ్డి తెలిపారు. అన్ని సర్వేలూ కాంగ్రెస్‌ కు అనుకూలంగా ఉన్నాయని, బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమన్నారు. నల్గొండలో ప్రచారం నిర్వహిస్తుంటే.. నా సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. గతంలో నాలుగు సార్లు నల్లగొండ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఓట్ల కోసం జండూబామ్‌ పెట్టుకుని ఏడుస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు. నాయకుడు ప్రజల కన్నీళ్లు తుడవాలి తప్ప ఓట్ల కోసం ఏడవకూడదన్నారు. ఇక బతుకమ్మ చీరలు ఎట్లుంటయ్యో అందరికీ తెలుసునని. అవన్నీ 60 రూపాయల చీరలని మండిపడ్డారు. ఒక్కసారి ఆ చీర కేసీఆర్‌ బిడ్డ కట్టుకుంటే తెలుస్తదన్నారు. తన సొంత డబ్బులతో నియోజకవర్గంలోని అక్కచెల్లెళ్లకు బతుకమ్మకు మంచి చీరలు కొనిచ్చానని తెలిపారు.

#telangana-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe