వైసీపీలో రోజుకో కుదుపు.. అధిష్టానం దిద్దుబాటు చర్యలు.. ఎమ్మెల్సీ వంశితో కోలా గురువులు భేటీ

ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం నేపథ్యంలో పార్టీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఆయనను బుజ్జగించేందుకు చర్యలు చేపట్టింది. వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు కోలా గురువులు హుటాహుటిన వంశి నివాసానికి వెళ్లారు.

New Update
వైసీపీలో రోజుకో కుదుపు.. అధిష్టానం దిద్దుబాటు చర్యలు.. ఎమ్మెల్సీ వంశితో కోలా గురువులు భేటీ

AP Politics - YCP: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం నేపథ్యంలో పార్టీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. ఆయనను బుజ్జగించేందుకు చర్యలు చేపట్టింది. వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు కోలా గురువులు హుటాహుటిన వంశి నివాసానికి వెళ్లారు. తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఎమ్మెల్సీని కోరారు. వంశీకృష్ణ శ్రీనివాస్ తో గురువులు చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు జగ్గంపేటలోనూ పలువురు వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: రంగాను చంపింది టీడీపీ ప్రభుత్వమే: వైసీపీ మంత్రి!

గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన వంశీకృష్ణ ఈ సారి ఎలాగైనా పోటీ చేసి విజయం సాధించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 27వ వార్డు కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్ పదవి ఆశించి భంగపడ్డారు. గాజువాక నుంచి వైసీపీ అధ్యర్థిగా పోటీ చేయాలని వంశీని గతంలో వైసీపీ పెద్దలు కోరినట్లు తెలుస్తోంది.

అయితే వంశీ మాత్రం విశాఖ తూర్పు టికెట్ ఇవ్వాలని కోరారు. ఇందుకు వైసీపీ అధిష్టానం నో చెప్పడంతో పార్టీ మారే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫ్యామిలీ తో వంశీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ఆయన టీడీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే జనసేనలోకి అయినా వెళ్లి పొత్తుల్లో భాగంగా టీడీపీ (TDP) మద్దతుతో పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు