Kodi Kathi Seenu: ఎన్నికల బరిలో కోడి కత్తి శీను.. పోటీ అక్కడ నుండే..!

సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాస్ ఎన్నికల బరిలో ఉండనున్నట్లు ప్రకటించారు. ప్రధాన పార్టీలు సీట్ ఇస్తే పోటీ చేస్తానని లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో ఉంటానని తేల్చిచెప్పాడు. అమలాపురం లేదా ఇతర ప్రాంతం నుండైనా పోటీ చేయడానికి సిద్ధమన్నారు.

New Update
Kodi Kathi Seenu: ఎన్నికల బరిలో కోడి కత్తి శీను.. పోటీ అక్కడ నుండే..!

Kodi Kathi Srinivasa Rao: ఏపీలో కోడి కత్తి కేసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జనపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. జగన్ కు సింపతి పెరిగి సీఎం అవుతాడని అందుకే ఇలా దాడి చేశానని శ్రీనివాస్ పలుమార్లు వాపోయాడు. దాదాపు ఐదేళ్లు జైల్లో ఉండి రిసెంట్ గా బెయిల్ పై విడుదల అయ్యాడు. అయితే, తాజాగా జనుపల్లి శ్రీనివాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వెల్లడించారు.

Also Read: కాశీ విశ్వనాథుని ఈ 6 రహస్యాలు వింటే మీరు మైమరచిపోవడం ఖాయం..!

ప్రధాన పార్టీలు సీట్ ఇస్తే పోటీ చేస్తానని.. లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో ఉంటాను తేల్చిచెబుతున్నాడు. సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి చట్టసభల్లో తన గొంతు వినిపించాలన్నారు. తాను అనివార్య కారణాలవల్ల జైల్లోకి వెళ్ళవలసి వచ్చిందని..తాను జైల్లో ఉన్న సమయంలో బుక్స్ చదివి సమాజం పట్ల అవగాహన తెచ్చుకున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుండి సేవా కార్యక్రమంలో పాల్గొనేవాడినిని చెప్పుకొచ్చారు. ప్రధాన పార్టీలు తనన్ను గుర్తించి అవకాశం కల్పిస్తే పోటీ చేస్తానని అభ్యర్థించారు.

Also Read: వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్..!

అమలాపురం నుండి కానీ లేదా ఇతర ప్రాంతం నుండైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని.. డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే అసెంబ్లీకి వెళ్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్త కొరవడి తీసుకొచ్చే విధంగా డబ్బులు లేకుండా ఒక సామాన్యుడుగా గెలిచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు తనకు సీట్ ఇస్తే మిగిలిన పార్టీలు వ్యతిరేకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తాయనే ఒక భయం కూడా ఉందని వ్యాఖ్యానించారు. జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శీను చేసిన ఈ కామెంట్స్ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Advertisment
తాజా కథనాలు