Gun License : సినిమా చూస్తున్నారు.. మీ అభిమాన హీరోకి జరిగిన అన్యాయంపై కోపం వచ్చింది.. విలన్స్ దగ్గరకి పెద్ద గన్ తీసుకుని వెళ్ళాడు. ధనా..ధన్.. ఒకదాని తరువాత ఒకటి బులెట్ల వర్షం కురిపించాడు. విలన్లు చచ్చారు. అప్పటి వరకూ సీటు ఎడ్జ్ లో ఊపిరి బిగబట్టి కూచుని చూసిన మీరు ఊపిరి తీసుకున్నారు. ఇంటికి వెళ్లిపోయారు. మిమ్మల్ని ఆ సీన్ వెంటాడుతోంది. తుపాకీ తీసుకుని ధనా.. ధన్ మంటూ భలే కాల్చేశాడు హీరో అని మురిసిపోయారు.ఎప్పుడైనా అనిపించిందా? అంత ఈజీగా తుపాకీ పట్టుకుని మన దేశంలో తిరిగేయవచ్చా? అని. అదంతా సినిమా. నిజంగా జరిగే అవకాశం లేదు కాబట్టే దానిని మన దర్శకులు అంత అద్భుతంగ చూపిస్తారు. కల్పితం కాబట్టే మనకు బాగా పట్టేసుకుంటుంది. ఎందుకంటే, మనల్ని నిజం కంటే కల్పితమే ఎక్కువ ఆకర్షిస్తుంది.
సరే.. అదలా పక్కన పెడితే.. మన దేశంలో ఆత్మరక్షణ కోసం తుపాకీ దగ్గర ఉంచుకోవచ్చు. అయితే, దానికి ప్రభుత్వం నుంచి లైసెన్స్(Gun License) తీసుకోవాలి. లైసెన్స్ అంటే బండి నడపడం వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినట్టు కాదు.. తుపాకీ లైసెన్స్ కోసం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది అంత ఈజీగా దొరకదు కూడా.. ఇప్పుడు తుపాకీ లైసెన్స్ తీసుకోవాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.
లైసెన్సులు ఎవరు ఇస్తారు?
రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖ/మంత్రిత్వ శాఖ లైసెన్స్(Gun License) ఇస్తుంది. వివిధ రాష్ట్రాల్లో, DM, జిల్లా కలెక్టర్, కమిషనర్ లేదా ఈ స్థాయి అధికారి ఎవరైనా లైసెన్స్ జారీ చేయవచ్చు. అంతే కాకుండా పోలీస్ స్టేషన్ - లోకల్ ఎడ్మినిస్ట్రేషన్ కూడా ఇందులో పాత్ర పోషిస్తుంది. దీని కోసం మీరు ఒక్కొక్కటి ఒక్కో ఫారమ్‌ను పూరించాలి. దీని కోసం, మీకు ఆయుధం ఎందుకు కావాలి, మీకు ఎలాంటి ఆయుధం కావాలి - ఇందులో పిస్టల్, రివాల్వర్ లేదా రైఫిల్, డబుల్ బారెల్ వంటి పెద్ద తుపాకీలు వంటి చిన్న ఆయుధాలు ఇలా ఎలాంటిది కావాలో తెలపాలి.
భారతదేశంలో తుపాకీ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి
దీని కోసం, ముందుగా మీరు ఆయుధాల లైసెన్స్(Gun License) దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. మీరు ఈ ఫారమ్‌ను మీ రాష్ట్ర పోలీసు శాఖ వెబ్‌సైట్ https://ndal-alis.gov.in/armslicence/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . అప్లికేషన్‌లో, మీరు మీ వ్యక్తిగత వివరాలు, విద్య, ఆదాయ వనరు - మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆయుధం గురించి సమాచారాన్ని పూరించాలి. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ డాక్యుమెంట్స్ కావాలి..
- పాస్ పోర్ట్ సైజు ఫోటో
- గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్, ఓటర్ ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి)
- చిరునామా రుజువు
- విద్యార్హత సర్టిఫికేట్
- ఆదాయ ధృవీకరణ పత్రం
- వైద్య ధృవీకరణ పత్రం
మీపై ఎలాంటి తీవ్రమైన క్రిమినల్ కేసు ఉండకూడదని గుర్తుంచుకోండి, మీరు ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే, దాని గురించి తెలియజేయాలి.
పోలీసు ధృవీకరణ
దరఖాస్తు ఫారమ్ - పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, పోలీసులు మీ ధృవీకరణను చేస్తారు. పోలీసులు మీ నేర చరిత్ర, మీ సామాజిక సంబంధాలు - మీరు దరఖాస్తు చేస్తున్న ఆయుధాన్ని మీరు ఉపయోగించాల్సిన అవసరం ఉందా? అంటే మీకు ఈ ఆయుధం ఎందుకు కావాలి? వంటివి పరిశీలిస్తారు.
DM ఆమోదంతో..
జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదం తర్వాత లైసెన్స్(Gun License) జారీ చేస్తారు. దీని తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్న అదే ఆయుధాన్ని కొనుగోలు చేయవచ్చు. మీరు ప్రభుత్వ నమోదిత దుకాణాల నుంచి మాత్రమే తుపాకీలను కొనుగోలు చేయవచ్చు. లైసెన్స్‌పై ఏ ఆయుధాన్ని తీసుకున్నారనే పూర్తి వివరాలను కూడా పోలీసు స్టేషన్‌లో పోలీసుల వద్ద ఉంచాల్సి ఉంటుంది.
తుపాకీ లైసెన్స్ ప్రాసెసింగ్ సమయం
ఆన్‌లైన్‌లో తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, ప్రక్రియ సాధారణంగా 3 నుంచి 6 నెలల వరకు పడుతుంది. మీ దరఖాస్తు ఆమోదించితేనే మీకు లైసెన్స్ జారీ చేస్తారు. లైసెన్స్ జారీ చేసిన తర్వాత, మీరు దానిని మీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి బుల్లెట్‌కు లెక్కలు..
తుపాకీ లైసెన్స్‌తో పాటు ఏడాదికి ఎన్ని బుల్లెట్లు వాడాలనేది కూడా నిర్ణయించారు. మీరు ఎన్ని బుల్లెట్స్ ఎక్కడ ఖర్చు చేస్తున్నారో పూర్తి రికార్డును ఉంచాలి. పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత మాత్రమే మీకు మళ్లీ కొత్త బుల్లెట్స్ ఇస్తారు.
Also Read: చలికాలంలో చెవినొప్పి ఇబ్బంది పెడుతుందా?ఈ చిట్కాలతో చెవినొప్పి బలాదూర్..!!
లైసెన్స్ హోల్డర్ ప్రదర్శన లేదా అక్రమార్జన కోసం కాల్పులు జరిపినా లేదా ప్రజలలో భయాందోళనలకు గురిచేసినా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇది మాత్రమే కాదు, లైసెన్స్ హోల్డర్ దీని కోసం జైలుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. మీరు పైన పేర్కొన్న ఈ నిబంధనలు - షరతులను పాటించకపోతే, మీ లైసెన్స్ రద్దు చేస్తారు. మీ తుపాకీ కూడా తిరిగి తీసుకుంటారు.
లైసెన్స్ రెన్యూవల్
ఇంతకుముందు గన్ లైసెన్స్ 3 సంవత్సరాలకు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దాని కాలపరిమితిని 5 సంవత్సరాలకు పెంచింది. ఈ చెల్లుబాటు ముగిసిన తర్వాత, లైసెన్స్‌ని మళ్లీ రెన్యూవల్ చేసుకోవాలి. రెన్యూవల్ కూడా లైసెన్స్ హోల్డర్ ధృవీకరణ ద్వారానే జరుగుతుంది అలాగే మళ్ళీ లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉంటుంది.
Watch this interesting Video :