Kitechen Hacks: గ్యాస్ బర్నర్లు క్లీన్ చేయడం లేదా..? అయితే జాగ్రత్త..!

వంటగదిలో గ్యాస్ బర్నర్లను చాలా కాలం పాటు శుభ్రం చేయకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటి రంధ్రాలలో ధూళి పేరుకుపోయి మంట సరిగ్గా రాకపోవడం, గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

New Update
Kitechen Hacks: గ్యాస్ బర్నర్లు క్లీన్ చేయడం లేదా..? అయితే జాగ్రత్త..!

Kitechen Hacks: సాధారణంగా శుభ్రపరిచేటప్పుడు పాత్రలు, స్లాబ్‌లు లేదా టైల్స్‌ పై మాత్రమే ఎక్కువ దృష్టి పెడతారు ఆడవారు. వంటకు అవసరమయ్యే గ్యాస్ బర్నర్లు మాత్రం ఆశ్రద్ధ చేస్తుంటారు. చాలా కాలంగా వీటిని శుభ్రం చేయకుండా ఉండడం వల్ల వాటి రంధ్రాలలో ధూళి పేరుకుపోయి మురికితో నల్లగా మారడం ప్రారంభమవుతాయి . దీని వల్ల గ్యాస్ బర్నర్ నుంచి మంట సరిగా రాకపోవడం, గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వీటిని శుభ్రం చేయడానికి కూడా మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సింపుల్ చిట్కాలతో గ్యాస్ బర్నర్ ఈజీగా క్లీన్ చేయవచ్చు.

నిమ్మకాయ

గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడానికి నిమ్మకాయ ద్రావణాన్ని కూడా వాడవచ్చు . దీని కోసం ముందుగా ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని రాత్రంతా బర్నర్‌ను అందులో ఉంచండి. మరుసటి రోజు ఉదయం నిమ్మతొక్కల్లో ఉప్పు వేసి తొక్కలతో బర్నర్‌ను శుభ్రం చేయండి. ఈ కిచెన్ హ్యాక్‌లను అనుసరించడం ద్వారా, గ్యాస్ బర్నర్ కొత్త బర్నర్‌లా మెరుస్తుంది.

వెనిగర్
వెనిగర్ తో బర్నర్ తలతలా మెరిసిపోతుంది. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో వెనిగర్ , ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మరిగించాలి. ఈ నీళ్లలో డర్టీ గ్యాస్ బర్నర్ వేసి కాసేపు అలాగే ఉంచాలి. అంతే బర్నర్ కొత్తగా మెరిసిపోతుంది.

publive-image

ఈనో పౌడర్

గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడానికి ,ఈనో సొల్యూషన్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ కిచెన్ చిట్కాను అనుసరించడానికి, ముందుగా ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని..అందులో నిమ్మకాయ, ఈనో కలపాలి. ఇప్పుడు ఈ ద్రవాన్ని బర్నర్‌పై కాసేపు ఉంచి ఆ పై ఒక బ్రష్ సహాయంతో బర్నర్‌ను రుద్దండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగి పొడి గుడ్డతో తుడవండి .

Advertisment
Advertisment
తాజా కథనాలు