Kitchen Tips: ఇంట్లో పప్పుకు పురుగు పడుతుందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే

వంట గదిలో పప్పులు, బియ్యానికి పురుగులు పట్టడం అందరి ఇంట్లో కనిపించే సాధారణ సమస్య. అయితే వీటిని కీటకాల నుంచి రక్షించడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. పప్పు స్టోర్ చేసే డబ్బాలో వేపాకు, లవంగం, లేదా వెల్లుల్లి రెమ్మలను వేస్తే పురుగు రాకుండా కాపాడుతుంది.

New Update
Kitchen Tips: ఇంట్లో పప్పుకు పురుగు పడుతుందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే

Kitchen Tips:  సహజంగా చాలా మంది ఎక్కువ మొత్తంలో పప్పులు, బియ్యం తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటారు. అయితే కొన్ని అజాగ్రత్తల కారణంగా వాటికి పురుగులు పట్టి చెడిపోతుండడం గమనించే ఉంటారు. దీని కారణంగా అవి తినడానికి కూడా పనికి రాకుండా పోతాయి. అందుకే వంట గదిలో పప్పు లేదా బియ్యం స్టోర్  చేసేటప్పుడు .. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

పప్పులకు పురుగు పట్టకుండా సింపుల్ టిప్స్

పుదీనా ఆకులు

పుదీనా ఆకులను కేవలం తినడానికి మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు చాలా మంది. కానీ బియ్యం, పప్పుల్లో పురుగులను తొలగించడానికి పుదీనా ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటి నుంచి వచ్చే ఘాటు వాసనను కీటకాలు భరించలేవు. దాంతో పురుగు పట్టకుండా..  గ్రేన్స్ ఫ్రెష్ గా ఉంటాయి. పప్పును స్టోర్ చేసే డబ్బాలో ఈ ఆకులను వేస్తే సరిపోతుంది.

వేపాకులు

బియ్యం, పప్పుకు పురుగు పట్టకుండా వేపాకులు కాపాడతాయి. నిల్వ చేసేముందు పప్పులతో పాటు ఎండిన వేపాకులను డబ్బాలో వేసి స్టోర్ చేయాలి. ఈ ఆకులు కీటకాలు రాకుండా ధాన్యాన్ని ఫ్రెష్ గా ఉంచుతాయి.

Also Read: Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?

publive-image

బిర్యానీ ఆకులు

ఇవి ఆహారానికి మంచి రుచి, ఫ్లేవర్ తో పాటు ఆహార పదార్థాలను కూడా రక్షిస్తాయి. బిర్యానీ ఆకులు నిల్వ ఉంచిన పప్పుదినుసులు, బియ్యానికి పురుగు రాకుండా కాపాడతాయి. అలాగే ఎక్కువ కాలం పాటు ఫ్రెష్ గా ఉంచుతాయి.

లవంగం

లవంగం.. ధాన్యాన్ని కీటకాల నుంచి రక్షిస్తుంది. పప్పులు, బియ్యాన్ని నిల్వ చేసే డబ్బాలో కొన్ని లవంగం ముక్కలు వేయాలి. ఇది మాత్రమే కాదు చక్కరలో చీమలను తొలగించడానికి కూడా లవంగం అద్భుతంగా పనిచేస్తుంది.

వెల్లుల్లి

సాధారణంగా వెల్లుల్లి ఘాటు ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది. పప్పు, బియ్యం డబ్బాలో వెల్లుల్లి రెమ్మలను వేయడం ద్వారా వీటి ఘాటుకు పురుగులు పారిపోతాయి. ఇవి ధాన్యాన్ని కీటకాల నుంచి రక్షించి.. ఫ్రెష్ గా ఉంచుతుంది.

Also Read: Cholesterol Friendly Veggies: అధిక కొలెస్ట్రాల్ కు.. ఈ కూరగాయలతో చెక్ పెట్టండి

Advertisment
Advertisment
తాజా కథనాలు