మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నేడు నల్లకుంటలోని శంకర్‌మఠ్ సమీపం నుంచి ఫీవర్ హాస్పిటల్ వరకు జరిగిన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంలో భాగంగా.. ‘శ్రమదానం’ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి.. మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం పేరుతో దేశవ్యాప్తంగా.. బీజేపీ పార్టీ తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున, స్వచ్ఛంద సేవాసంస్థల తరపున సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వారిచ్చిన స్వచ్ఛభారత్ స్ఫూర్తితో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చిన గాంధీజీ.. స్వాతంత్ర్య భారతదేశానికంటే ముందే.. స్వచ్ఛభారత్ సాధించాలని పిలుపునిచ్చారు.
చైతన్యాన్ని నింపేలా..
అదే స్ఫూర్తితో మోదీ ఆయన అధికారం చేపట్టినప్పటినుంచి నేటి వరకు నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛంగా కోట్లాదిమంది ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఈ శ్రమదానంలో పాల్గొంటున్నారు. నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని ప్రజాకార్యక్రమంగా నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలలో చదువుకునే చిన్నారిని అడిగినా.. స్వచ్ఛభారత్ కార్యక్రమం అంటే ఏంటో చెప్పేలా అందరిలో.. చైతన్యాన్ని నింపేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. పారిశుద్ధ్యత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనమంతా దేశాభివృద్ధిలో మన భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తామన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యం లేకుండా పూర్తికాదన్నారు. అందుకే ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి. స్వచ్ఛభారత్ నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకోవాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సీజనల్ వ్యాధుల ఇబ్బందులు
రేపు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు నల్లకుంటలో కిషన్ రెడ్డి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లకుంట శంకర్‌మఠ్ దగ్గర బీజేపీ నేతలు, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు కేంద్రమంత్రి. అనంతరం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఇది ఒక్క రోజు చేసే కార్యక్రమం కాదు.. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో కూడా గాంధీజీ స్వచ్ఛతను పాటించడంలో ముందుండేవారని కిషన్‌రెడ్డి తెలిపారు. పరిశుభ్రత లోపం కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనన్నారు. తమ తమ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా శుభ్రంగా వుండటం చాలా ముఖ్యమన్నారు కిషన్‌రెడ్డి.