/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/kishan-jpg.webp)
Janasena kiran rayol: వైసీపీలో చేరిన పోతిన మహేశ్‌పై తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. తన రాజకీయ జీవితం జనసేనలో నేనని, వేరే పార్టీ జెండా పట్టుకుంటే కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఎవరైనా తన చెయ్యి నరికేయవచ్చంటూ గతంలో మహేశ్ అన్నారని, మరి ఇప్పుడు ఆయన ఏ చేయి నరుక్కుంటారని కిరణ్ ప్రశ్నించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
Follow Us