అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మనవరాలి భద్రతలో భారీ లోపం తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. బిడెన్ మనవరాలు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ అద్దాన్ని పగులగొట్టేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ ఏజెంట్లు నిందితులపై కాల్పులు జరిపారు. అందిన సమాచారం ప్రకారం, నవోమి బిడెన్ యొక్క SUVని ధ్వంసం చేయడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించినప్పుడు బిడెన్ మనవరాలు రక్షించే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు.
నివేదికల ప్రకారం ఏజెంట్లలో ఒకరు కాల్పులు జరిపారని సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు ఎర్రటి కారులో పారిపోయినట్లు వెల్లడించాయి. దుండగుల కోసం సెర్చింగ్ ప్రారంభించినట్లు మెట్రోపాలిటన్ పోలీసులకు బులెటిన్ విడుదల చేసినట్లు సీక్రెట్ సర్వీస్ తెలిపింది. దేశ రాజధాని వాషింగ్టన్‌లో సీక్రెట్ సర్వీస్ ఎస్‌యూవీలోకి చొరబడేందుకు ప్రయత్నించిన నిందితులపై ప్రెసిడెంట్ జో బిడెన్ మనవరాలు రక్షించే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ వార్తా సంస్థ APకి తెలిపారు. ఈ అంశంపై వివరాలను బహిరంగంగా వెల్లడించలేమని అధికారి తెలిపారు.