Khammam Politics: ఖమ్మంలో పువ్వాడకు షాక్.. తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లోకి కీలక నాయకులు

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి తారా స్థాయికి చేరింది. తాజాగా ఖమ్మం మున్సిపలిటీ డిప్యూటీ మేయర్ దంపతులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఇందుకు కౌంటర్ గా మంత్రి పువ్వాడ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

New Update
Khammam Politics: ఖమ్మంలో పువ్వాడకు షాక్.. తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లోకి కీలక నాయకులు

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి (Congress Party) మరో బిగ్ షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ దంపతులు ఫామిమా, జోహరా-ముక్తర్ దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముక్తార్ సుడా డైరెక్టర్ గా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, చేరికలతో రాజకీయాల వేడి తారా స్థాయికి చేరింది. పువ్వాడ ఓటమే లక్ష్యంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా చేరకలపై వారు ఫుల్ ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ లో అసంతృప్తులను గుర్తించి వారిని కాంగ్రెస్ లో చేర్చుకోడానికి స్కెచ్ లు వేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని హస్తం నేతలు చెబుతున్నారు. అయితే.. తమ గెలుపును పొంగులేటి, తుమ్మల అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.
ఈ వీడియో కూడా చూడండి..

Advertisment
తాజా కథనాలు