Khammam Politics: ఆందోళనలో పొంగులేటి.. చుక్కలు చూపిస్తున్న హైకమాండ్.. అసలేం జరుగుతోంది?

కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రెండో లీస్టులో తన అనుచరుల కోసం అడుగుతున్న స్థానాలను పెండింగ్ లో పెట్టడం ఆయన వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం.

New Update
TS News: పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. సీఎం అవుతారన్న వార్తలపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తన ప్రధాన అనుచరులకు టికెట్లను ఇప్పించుకోవడంలో పొంగులేటి ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. రెండో జాబితాలో ఖమ్మం, పాలేరు, పినపాక సీట్లను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఖమ్మం టికెట్ తుమ్మల నాగేశ్వర రావు, పాలేరు సీటును పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కేటాయించారు. పినపాక సీటును పొంగులేటి ప్రధాన అనుచరుడు పాయం వెంకటేశ్వర్లుకు ఇచ్చారు.

Also Read: 70 స్థానాలతో అధికారంలోకి రాబోతున్నామంటున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇల్లందు, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా టికెట్లను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ 4 స్థానాల్లోనూ పొంగులేటి ముఖ్య అనుచరులు టికెట్ ఆశిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ఈ సీట్లలో ఒకటి లేదా రెండింటిని కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

మరో సీనియర్ నేత రేణుకా చౌదరి కూడా తన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ నాలుగింటిలో రెండు స్థానాల్లో టికెట్లను తన అనుచరులకు ఇప్పించుకోకపోతే పొంగులేటి బలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా పడిపోతుందని ఖమ్మం జిల్లాలో చర్చ సాగుతోంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచర వర్గం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు