రిపబ్లిక్ డే నాడు పంజాబ్ సీఎం ను చంపేస్తానంటూ హెచ్చరించిన ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్

రిపబ్లిక్ డే రోజున పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను చంపేస్తానని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరించాడు, దాడికి గ్యాంగ్‌స్టర్లు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

రిపబ్లిక్ డే నాడు పంజాబ్ సీఎం ను చంపేస్తానంటూ హెచ్చరించిన  ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్
New Update

Khalistani terrorist Pannun:ఖలిస్థాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ ( SFJ )సంస్థ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్నూన్‌  చేసిన బెదిరింపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈసారి పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ను(Punjab CM Bhagwant mann)  రిపబ్లిక్ డే జనవరి 26 న చంపేస్తామని హెచ్చరించాడు.ఈ దాడికి గ్యాంగ్‌స్టర్లు  అంతా ఏకమై రిపబ్లిక్‌ డే రోజున పంజాబ్‌ సీఎంను చంపేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చాడు.

గతంలో కూడా చాలా సార్లు బెదిరింపులు 

పన్నూన్‌ చేసిన బెదిరింపులపై పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ స్పందించారు. గ్యాంగ్‌స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పన్నూన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే .. పన్నూర్  ఇలా బెదిరింపులకు పాల్పడటం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికి చాలా సార్లు  భారత్‌కు చెందిన కొంతమంది నేతలని  చంపేస్తామంటూ,ప్రసిద్ధి చెందిన  ఆలయాలను , విమానాశ్రయాలను  ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించాడు.
2019లో SFJ సంస్థను నిషేధించిన ఇండియా
డిసెంబర్ నెలలో జరిగిన  పార్లమెంట్‌ భవనంపై దాడి చేస్తామని ముందే  హెచ్చరించాడు పన్నూర్.  ఇందుకు సంభందించిన వీడియో కూడా రిలీజ్ చేసాడు. .డిసెంబర్ 13న 2001లో ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసి 22 ఏళ్లు నిండడం గమనార్హం.సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) సంస్థను భారత ప్రభుత్వం  2019లో "చట్టవిరుద్ధమైన సంఘం"గా నిషేధించింది.  "దేశ వ్యతిరేక మరియు విధ్వంసక" కార్యకలాపాలకు పాల్పడిందని పేర్కొంది. అలాగే, కేంద్రం 2020లో పన్నూన్‌ను "వ్యక్తిగత ఉగ్రవాది"గా , అతను ఖలిస్తాన్ కోసం పోరాడాలని "పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్లు మరియు యువతకు" విజ్ఞప్తులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది.
ఎందుకీ దాడులు .. ఖలిస్థాన్ అంటే ?
ఖలిస్థాన్ అంటే పరిశుద్ధ భూమి అని అర్థం. పంజాబ్‌లో సిక్కుల జనాభా అధికంగా ఉంటుంది. భారత దేశ జనాభాలో మాత్రం సిక్కుల జనాభా రెండు శాతం మాత్రమే. మతాన్ని ఆధారంగా చేసుకుని  సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌తో ఖలిస్థాన్ ఉద్యమం మొదలైంది. ఆంగ్లేయుల  కాలంలోనే ఖలిస్థాన్ అనే ఆలోచనకు అంకురం ఏర్పడింది. భారత్, పాకిస్థాన్‌లలోని పంజాబ్ ప్రాంతంతో ఖలిస్థాన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ దేశ విభజన కాలంలో బయటికి వచ్చింది.
#khalistani-terrorist #punjab-chief-minister-bhagwant-mann #gurpatwant-singh-pannun
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి