/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Khairatabad-Ganesh-jpg.webp)
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడి పనుల్లో చివరి అంకం ముగిసింది. గణనాథుడికి కళ్లు దిద్దారు శిల్పి రాజేంద్రన్. శనివారం ఉదయానికి సపోర్ట్ కర్నలన్నింటినీ తొలగించనున్నారు. రేపు ఉదయం నుంచి భక్తులకు భారీ గణనాథుని చూసే అవకాశం కల్పించనున్నారు ఖైరతాబాద్ గణేష్ అసోసియేషన్. కాగా, వినాయక చవితి సందర్భంగా 18వ తేదీన ఉదయం 10 గంటలకు గవర్నర్ తమిళిసై తొలి పూజ చేయనున్నారు.
కాగా, ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు 63 అడుగుల ఎత్తులో రూపొందించారు. 2019లో 61 అడుగుల మేర రూపొందించగా.. ఈసారి అంతకు మించి రెండు అడుగులు ఎక్కువ ఎత్తులో రూపొందించారు. ఇక గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది విగ్రహం 13 అడుగుల ఎత్తు ఎక్కువ. 1954 నుంచి ఖైరతాబాద్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఖైరతాబాద్ గణేష్ అసోసియేషన్.. ప్రతి ఏటా విగ్రహం ఎత్తును పెంచుకుంటూ వస్తోంది. ఇప్పటి వరకు 69 సంవత్సరాలుగా గణనాథుడిని ప్రతిష్టించి పూజిస్తున్నారు.
విగ్రహం తయారీ విధానం ఇలా..
విగ్రహం లోపలి భాగం 20 టన్నుల ఉక్కుతో అమర్చుతారు. దానిపై కళాకారులు వరి గడ్డి, వరి పొట్టు, జనపనార వస్త్రంతో ఒక రూపురేఖలను తీర్చిదిద్దుతారు. రాజస్థాన్ నుంచి తెచ్చిన పొడి మట్టిని నీటిలో కలిపి బయటి పొరను తయారు చేస్తారు. ఇక గత సంవత్సరం నుండి వాటర్ కలర్స్ ఉపయోగించడం ప్రారంభించినట్లు ఖైరతాబాద్ గణేష్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఇక విగ్రహాన్ని జిప్సమ్‌కు బదులుగా మట్టితో తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేయడం ఇది రెండవసారి. కాగా, హిందూ కాలమానం ప్రకారం.. సెప్టెంబర్ 18న వినాయక చవితి రోజున ప్రతిష్ఠించి గణనాథుడిని ప్రతిష్టించి, సెప్టెంబర్ 28న లేదా అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు.
Also Read:
Telangana: మరో కీలక పథకం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యార్థులకు ఇక నుంచి..
Telangana: విశ్వకర్మ యోజనతో రూ. 3 లక్షల రుణం.. కీలక వివరాలు వెల్లడించిన ఎంపీ లక్ష్మణ్..
Follow Us