Kethireddy Pedda Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆచూకీపై కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పోలింగ్ రోజు పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఘర్షణ జరిగింది. ఆ తర్వాత నుంచి పెద్దారెడ్డి కనిపించనట్లుగా తెలుస్తోంది. అదే రోజు టీడీపీ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గర సైతం గొడవ జరిగింది. పోలీసులు విసిరిన టియర్ గ్యాస్‌తో జేసీ అస్వస్థతకు గురైయ్యారు. హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి తాడిపత్రి చేరుకున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
Also Read: దెందులూరులో టెన్షన్.. చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు..!
అయితే, పెద్దారెడ్డి మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారోనని కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. పోలింగ్ రోజు అర్ధరాత్రి పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
ఇదిలా ఉంటే.. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు తాడిపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ ఉండటానికి వీల్లేదంటూ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు పవన్ రెడ్డిని భద్రత మధ్య తాడిపత్రి నుంచి పంపించారు.