Revanth Reddy: దుబ్బాక నిధులను సిద్దిపేటకు పట్టుకపోయిండ్రు: ముత్యంరెడ్డి కొడుకును గెలిపించండి

దుబ్బాక నిధులు సిద్దిపేటకు మల్లిపోకుండా ఉండాలంటే కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రసంగించారు. రఘునందనరావు మాట తప్పారని, మూడేళ్లలో ఆయన దుబ్బాకకు చేసిందేమీ లేదని విమర్శించారు.

New Update
Revanth Reddy: దుబ్బాక నిధులను సిద్దిపేటకు పట్టుకపోయిండ్రు: ముత్యంరెడ్డి కొడుకును గెలిపించండి

Telangana Elections 2023: బీఆర్ఎస్ పాలనలో దుబ్బాకకు రావలసిన నిధులను మామా అల్లుళ్లిద్దరూ కలిసి సిద్దిపేటకు తరలించేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. చెరుకు ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులూ దుబ్బాకకు వచ్చే నిధులు పక్కకు పోకుండా జాగ్రత్త పడ్డారని, ఇప్పుడు ఆయన కొడుకు శ్రీనివాసరెడ్డిని ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పాలనను; సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావును తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ అయిన రామలింగారెడ్డిని పక్కన పెట్టి హరీశ్ రావు (Harish Rao)కు మంత్రి పదవిని కేసీఆర్ కట్టబెట్టారన్నారు. రాష్ట్రం వచ్చిన పదేళ్లలో దుబ్బాకకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. కొత్త ప్రభాకరరెడ్డి కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర బంట్రోతుగా వ్యవహరిస్తున్నాడని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ ఎంపీగా ఉన్న ఆయన దుబ్బాకకు నిధులు తేవడంలో, రెవెన్యూ డివిజన్ తేవడంలో విఫలమయ్యారన్నారు. కనీసం దుబ్బాకకు పీజీ కాలేజీ, చేగుంటలో డిగ్రీ కాలేజీ కూడా తేలేకపోయారని దుయ్యబట్టారు.

ఇది కూడా చదవండి: సూర్యాపేటలో పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. గద్దర్ పాటతో ఉర్రూతలూగించిన పవర్ స్టార్

మరోవైపు ఉపఎన్నికల్లో గెలుపొందిన రఘునందనరావు (Raghunandan Rao) మూడేళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాట తప్పిన ఆయనకు ఓటు అడిగే హక్కే లేదని విమర్శించారు. అంతర్గత కుమ్ములాటల్లో ఆయన మునిగిపోయారన్నారు. సీఎం కేసీఆర్ పదివేల ఎకరాలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఓ పక్క హరీశ్ రావు, మరోపక్క కేటీఆర్ (KTR) ఉండి కూడా దుబ్బాకను బంగారు తునకగా ఎందుకు మార్చలేకపోయారని టీపీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు