Poonch Terror Attack: పూంచ్‌లో ఉగ్రదాడి.. దాడుల వెనుక చైనా, పాకిస్తాన్ కుట్ర ఉందా?

ఉగ్రవాద కార్యకలాపాలు కశ్మీర్ నుంచి పూంచ్-రాజౌరీ రీజియన్‌కు ఎందుకు మారాయి? భారత్‌ భద్రతా బలగాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఈ విధమైన దాడులకు పాల్పడుతుందా? పూంచ్‌లో రెండు భద్రతా వాహనాలపై ఉగ్రవాదులు కాల్పుల వెనుక అసలు కథేంటో ఆర్టికల్ లో తెలుసుకుందాం..

New Update
Poonch Terror Attack: పూంచ్‌లో ఉగ్రదాడి.. దాడుల వెనుక చైనా, పాకిస్తాన్ కుట్ర ఉందా?

సైనికుడు వీరమరణం..
పూంచ్ జిల్లాలోని సురన్‌కోట్ (Surankote) ప్రాంతంలో వైమానిక దళ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక సైనికుడు వీరమరణం పొందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. కాన్వాయ్‌లోని రెండు వాహనాల్లో ఒకదానిని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వాహనం అద్దంపై 15 బుల్లెట్ల గుర్తులు కనిపించాయి. ఈ దాడిలో సైనికుల ఛాతీ , తల, మెడపై బుల్లెట్లు తగిలాయి. దీంతో ఉగ్రవాదులు వాహనాన్ని ముందు నుంచి చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అమర వీరుడు విక్కీ పహాడే (Vicky Pahade) ఛాతీపైనా, తలపైనా బుల్లెట్లు తగిలాయి.

తొలిసారి కాదు..
ఇలా పూంచ్‌ వేదికగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం ఇది తొలిసారి కాదు.. 2024 జనవరి 12న, ఉగ్రవాదులు కృష్ణా లోయ ప్రాంతంలో సైనిక వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. అంతకుముందు 2023 డిసెంబర్ 22న సైనిక వాహనాలపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత 30 నెలల్లో పూంచ్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. 2021 ప్రారంభం నుంచి 2024 మే4 వరకు జరిగిన అనేక ఘటనల్లో 21 మంది సైనికులు దేశం కోసం ప్రాణాలర్పించారు.

 Also Read: జనం కోసం పుట్టిన జనసేనాని నా తమ్ముడు.. పవన్ కోసం చిరంజీవి సంచలన వీడియో
హింసాత్మక ఘటనలు
చైనా-పాకిస్థాన్‌ కలిసి పూంచ్‌ రీజియన్‌లో కుట్రలకు పాల్పడుతున్నట్టు పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. పూంచ్‌లో కొన్నాళ్లుగా జరుగుతున్న టెర్రరిస్ట్‌ యాక్టివిటీస్‌ వెనుక చైనా హస్తం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇస్లామాబాద్-బీజింగ్‌ల సమన్వయ వ్యూహంలో భాగంగానే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని డిఫెన్స్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భద్రతా బలగాలపై దాడులు చేయడం, రెచ్చగొట్టడమే లక్ష్యంగా పాకిస్తాన్ భారీ సంఖ్యలో ఉగ్రవాదులను పూంచ్ అటవీ ప్రాంతాల్లోకి చొరబడేలా చేస్తోందని సమాచారం.

అధికంగా మరణాలు
పూంచ్-రాజౌరీలో తరచు ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. అటవీ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు సైన్యం చేస్తున్న పోరాటం ఆపరేషన్ సర్ప్ వినాష్‌ను గుర్తుకు తెస్తోంది. అటు పూంచ్-రాజౌరీలో ఉగ్రవాద దాడులు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో స్మగ్లర్లు, డ్రగ్స్‌ సరఫరా చేసేవారు ఎక్కువగా ఉంటారు. 2023లో సరిహద్దు జిల్లాలైన రాజౌరి -పూంచ్ సమీపంలోని రియాసి జిల్లాలో ఉగ్రవాద సంబంధిత ఘటనలలో అధికంగా మరణాలు నమోదయ్యాయి.

అంతేలేకుండా..
ఉగ్రవాదుల దాడుల్లో అమరలవుతున్న వారి సంఖ్య ప్రతీఏడాది పెరుగుతుండడం కలవరపెడుతోంది. ఓవైపు ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుండగా.. మరోవైపు కాపు కాచిన నక్కల్లా జవాన్లపై దాడులు చేస్తున్నారు ముష్కరులు. అటు నా అన్న వాళ్ళను కోల్పోయిన బాధతో బాధిత కుటుంబాల వేదనకు అంతేలేకుండా పోతోంది.

Advertisment
తాజా కథనాలు