కరవు కాలంలో లగ్జరీ విమానం అవసరమా!.. మరి మోదీ ఎలా వెళ్తారో?.. కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం

సిద్ధరామయ్య ఓ ప్రైవేటు జెట్ లో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రం క్షామంతో అల్లాడుతూ, రైతులు సంక్షోభంలో ఉంటే, ముఖ్యమంత్రులు, మంత్రులూ లగ్జరీని ప్రదర్శిస్తున్నారంటూ బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ కూడా వాటిని తిప్పికొడుతోంది.

New Update
కరవు కాలంలో లగ్జరీ విమానం అవసరమా!.. మరి మోదీ ఎలా వెళ్తారో?.. కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం

Karnataka Politics: ‘కరువు కాలంలో విలాసాలు కావాల్సొచ్చాయా!.. కరువు సాయం అడగడం కోసం విలాసవంతమైన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాలా’’... ఇదీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ చేస్తున్న విమర్శల దాడి. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ప్రయాణిస్తారు? ఆయన ఏ విమానంలో ప్రయాణాలు చేస్తారు?... ఇది కాంగ్రెస్ నేతల ఎదురుదాడి. 

సిద్ధరామయ్య ఓ ప్రైవేటు జెట్ లో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది. అది కరువు సహాయక నిధులను అభ్యర్థించేందుకు కర్ణాటక సీఎం హస్తినకు వెళ్తున్న వీడియో. అందులో కర్ణాటక సీఎంతో పాటు మంత్రులు జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, కృష్ణ బైరేగౌడ తదితరులు ఉన్నారు. ఓ వైపు రాష్ట్రం క్షామంతో అల్లాడుతూ, అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయి, రైతులు సంక్షోభంలో ఉంటే, ముఖ్యమంత్రులు, మంత్రులూ లగ్జరీని ప్రదర్శిస్తున్నారంటూ ఆ వీడియోపై బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అది కూడా కరువు సహాయక నిధుల అభ్యర్థన కోసం అంత విలాసవంతంగా వెళ్లాల్సిన అవసరమేమిటన్నది వారి ప్రశ్న. ఇది ప్రజలు కట్టిన పన్నులను వృథా చేయడమే అంటున్నారు వాళ్లు. బీజేపీ కర్ణాటక అధ్యక్షఉడు బి.వై. విజయేంద్ర ఈ మేరకు ట్విట్టర్ లో ఘాటైన విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో కొత్త పార్టీ.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన

కాంగ్రెస్ కూడా ఈ విమర్శలను గట్టిగానే తిప్పికొడుతోంది. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ప్రయాణిస్తారు? ఆయన ఏ విమానంలో ప్రయాణాలు చేస్తారు? బీజేపీ నాయకులనే అడగండి ఈ ప్రశ్నలన్నీ’’ అంటూ మీడియాతో మాట్లాడుతూ రుసరుసలాడారు. ఈ మాటల యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు