Telangana: జేసీబీలను సైతం అవలీలగా మాయం చేస్తున్న ఘరానా ముఠా.. చివరకు..

జేసీబీలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాలు, అధునాతన సాంకేతిన పరిజ్ఞానం సాయంతో నిందితులను పట్టుకున్నారు.

Telangana: జేసీబీలను సైతం అవలీలగా మాయం చేస్తున్న ఘరానా ముఠా.. చివరకు..
New Update

Karimnagar JCB Robbery: చిన్నా చితకా దొంగ తనాలో ప్రయోజనం లేదనుకున్నారో.. లేక చిరు చిరు దోపిడీలు కిక్కు ఇవ్వడం లేదనుకున్నారో ఏమో గానీ.. కేటుగాళ్లు ఏకంగా జేసీబీలనే టార్గెట్‌గా చేసుకుని మాయం చేస్తున్నారు. అయితే, ఎంతటి ఘరానా దొంగలైనా.. ఖాకీల డేగ కళ్ల నుంచి తప్పించుకున్నా.. నిఘా నేత్రాల నుంచి తప్పించుకోలేరనేది సత్యం. అవును, తాజాగా జేసీబీలే టార్గెట్‌గా దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాలు, అధునాతన సాంకేతిన పరిజ్ఞానం సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

గోపాల్ పూర్ గ్రామానికి చెందిన ఎర్ర రామకృష్ణ s/o యేసు రెడ్డి మెడికల్ రెప్రెసెంటివ్ గా పని చేస్తున్నాడు. కరోనా సంక్షోభం కారణంగా విధించిన లాక్ డౌన్‌తో అతని ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఆ సమస్య నుంచి బయట పడాలని ఉద్దేశ్యంతో వ్యాపారం ప్రారంభించడం కోసం జేసీబీ ని కొనుగోలు చేశాడు. కరీంనగర్ చుట్టు ప్రక్కల గ్రామాలలో డ్రైవర్ ని పెట్టి నడుపుతూ, రోజు పని పూర్తియిన అనంతరం జేసీబీ ని తన గ్రామంలో ఊరి చివరన గల తన పొలం వద్ద పెట్టేవాడు.

ఈ నేపథ్యంలోనే 12-09-2023 రోజున తన వ్యవసాయ క్షేత్రంలో జేసీబీని పార్క్ చేశాడు. మరుసటి రోజు 13-09-2023 న ఉదయం వెళ్లి చూసే వరకు జేసీబీ పార్క్ చేసిన స్థలంలో కనపడలేదు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. చివరకు తన జేసీబీని ఎవరో దొంగిలించారని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అచ్చం ఇలాంటి జేసీబీ దోపిడీ ఘటనే కరీంనగర్ జిల్లాలో పరిధిలో మరికొన్ని జరిగాయి.

తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన వేల్పుల గోపాల్ బతుకుదెరువు కోసం ఒక జేసీబీ కొనుక్కుని స్వయం ఉపాధి పొందుతున్నాడు. ఆ జేసీబీని తన ఇంటి ప్రక్కన కాళీ స్థలంలో పార్క్ చేశాడు. 30-09-2023 తేదీన వెళ్లి చూడగా జేసీబీ అక్కడే ఉంది. కానీ మరుసటి రోజు అంటే 01-10-23 తేదీన ఉదయం లేచి చూసే సరికి తన జేసీబీ పార్క్ చేసిన స్థలంలో లేదు. దాంతో ఈ బాధితుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇక కొత్తపల్లి గ్రామానికి చెందిన లింగమూర్తి జీవనోపాధి కోసం జేసీబీ కొనుగోలు చేశాడు. దానిని నడుపుకుంటూ జీవిస్తున్నాడు. 11-09-2023 న జేసీబీ ని కొత్తపల్లి శివారులోని పెట్రోల్ బంక్ వద్ద పెట్టి వెళ్లాడు. కాసేపటి తరువాత జేసీబీ వద్దకు వెళ్లేసరికి గుర్తు తెలియని దొంగలు ఆ జేసీబీని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అది గమనించిన యజమాని.. వారిని వెంబడించాడు. దాంతో దొంగలు జేసీబీని వదిలేసి పారిపోయారు.

ఈ దోపిడీలకు పాల్పడింది వీరే..

కరీంనగర్‌కు చెందిన గుంజే లక్ష్మణ్ గతంలో ట్రాక్టర్, జేసీబీ డ్రైవర్ గా పనిచేశాడు. అయితే కాలక్రమేణా అతనే బ్యాంకు లోన్ తీసుకుని ఒక జేసీబిని కొనుగోలు చేశాడు. ఆ కొద్ది రోజులకే మరో జేసీబీని కూడా కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఒక ట్రాక్టర్ కూడా అదే బ్యాంకు లోనుతో కొనుగోలు చేశాడు. వీటిలో ఒక దానికి మహబూబాబాద్ జిల్లా కురివి మండలం రాయినిపట్నం గ్రామానికి చెందిన వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే, బ్యాంకు లోన్స్ అన్ని కలిపి ప్రతి నెల రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఇఎంఐ కట్టాల్సి వస్తుంది. అయితే, వ్యాపారం అనుకున్నంత లేక.. భారీగా అప్పులు పెరిగిపోయాయి. దాంతో లోన్స్ కట్టలేకపోయాడు.

ఈ నేపథ్యంలోనే.. ఒక జేసీబీ ని తనకు పరిచయం ఉన్న బెజ్జారం రమేష్ ద్వారా షకీల్ అనే వ్యక్తికి విక్రయించాడు. ఆ సమయంలోనే ముగ్గురికి పరిచయం పెరిగింది. ఇక లక్ష్మణ్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ కార్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కానీ అతని అవసరాలకు వచ్చే డబ్బులు సరిపోవడం లేదు. ఈ కమ్రంలో రమేష్ ద్వారా జేసీబీ లను దొంగతనం చేసి తీసుకువచ్చి హైదరాబాద్ లో వారు చెప్పిన ప్రదేశంలో జేసీబీని అప్పగిస్తే వాళ్ళు 3 నుంచి 5 లక్షల వరకు ఇస్తారని మిగతావి వాళ్ళే చూసుకుంటారని లక్ష్మణ్‌కు రమేష్ తెలిపాడు.

ఇలా దొంగతనం చేసి సులభంగా డబ్బులు సంపాదించాలని భావించి.. తన బావమరిది అయిన తుర్కా మురళితో ఈ చోరీలకు పాల్పడ్డాడు. ఇక గతంలో తన వద్ద డ్రైవర్‌గా పని చేసిన యాకాంబరాన్ని కూడా తన గ్రూప్‌లో కలుపుకున్నాడు. అయితే, కరీంనగర్‌లో ఎక్కడ జేసీబీలు ఎక్కువగా ఉంటాయయో తెలుసుకుని, అక్కడ జేసీబీలను ఎత్తుకెళ్లేవారు.

ఈ క్రమంలోనే కరీంనగర్‌ను టార్గెట్‌గా చేసుకుని లక్ష్మణ్, మురళి, యాకాంబరం కలిసి కొత్తపల్లి ఏరియాలో తిరుగుతూ.. కొత్తపల్లి శివారులోని పెట్రోల్ బంక్ వద్ద జేసీబీ ఉండగా దానిని దొంగలించారు. అయితే, బండి యజమాని చోరీని గుర్తించి వెంబడించే సరికి గత్యంతరం లేక ఆ జేసీబీని వదిలిపారిపోయారు.

ఆ తరువాత అమరుసటి రోజు రాత్రి కారు లో ముగ్గురు తిరుగుతుండగా గోపాల్‌ర్ గ్రామా శివారులో ఒక జేసీబీ పొలాల వద్ద కొట్టంలో కనిపించింది. ఆ జేసీబీని కూడా దొంగలించుకుపోయారు. టోల్ గేట్ ల వద్ద తప్పుడు నంబర్స్ చెబుతూ.. సీసీ కెమెరాలో పడకుండా జాగ్రత్తపడుతూ హైదరాబాద్‌లో రమేష్ ద్వారా షకీల్ కు అప్పగించేవారు. ఇలా వీరికి 3.5 లక్షలు ఇవ్వగా.. రమేష్‌కు కమిషన్ ఇచ్చి మిగతా డబ్బులు వీళ్ళు పంచుకున్నారు. ఆ తరువాత వాటిని షకీల్ ఫేక్ డాకుమెంట్స్ సృష్టించి ఇతర రాష్ట్రాలలో అమ్మేందుకు ఏర్పాటు చేశాడు. ఇలా వరుసగా జేసీబీలు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు.

నిందితులు వివరాలు

1) గుంజే లక్ష్మణ్ s/o వెంకన్న, వయస్సు 30 yrs, కులం వడ్డెర, వృత్తి:- డ్రైవర్ నివాసం హాన్ మాన్ నగర్, తీగలగుట్టపల్లి.

2) తుర్కా మురళి s/o వెంకన్న, 27 yrs, కులం వడ్డెర, వృత్తి:- డ్రైవర్ నివాసం లక్ష్మీపూర్ గ్రామo, మహబూబాబాద్ జిల్లా.

3) ఆలకుంట యాకాంబరం బక్కయ్య, వయస్సు 20 yrs కులం వడ్డెర రాయినిపట్నం (గ్రామo), కురివి మండల్, మహబూబబాద్ జిల్లా.

4) బెజ్జారం రమేష్ s/o నారాయణ, వయస్సు 50 yrs, కులం మున్నూరుకాపు నివాసం న్యవ నంది సిరికొండ నిజామాబాద్ జిల్లా.

5)కోట్ల షకీల్ s/o ఘనీ మియా, వయస్సు 28 yrs, కులం ముస్లిం వృత్తి వ్యవసాయం నివాసం నిజాంపేట్ గ్రామo, మేడిపల్లి పూడూర్ మండల్ వికారాబాద్ జిల్లా.

స్వాధీనం చేసుకున్న ఆస్తి వివరాలు:

1) జేసీబీ b/no. TS-02-EZ-7371, W. Rs. 9,00,000/-.
2) జేసీబీ b/no. TS-02-EY-6437, W. Rs. 8,00,000/-.

కేసుల ఛేదనలో శ్రమించిన పోలీస్ ప్రత్యేక బృందం:

1. ఆవుదూర్తి దయానంద్, PC 2955 కరీంనగర్ రూరల్ పి. యస్.

2. మీసాల రమేష్, HC 2154 కరీంనగర్ రూరల్ పి. యస్.

3. గొంటి అశోక్ HC 1576, కరీంనగర్ రూరల్ పి. యస్.

4. కె.రాజు సబ్- ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, కరీంనగర్ రూరల్ పి. యస్.

5. ఎ.ప్రదీప్ కుమార్, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, కరీంనగర్ రూరల్ పి. యస్. IT కోర్ సిబ్బంది.

ప్రజలకు పోలీసుల సూచనలు..

1. మీరు మీ వాహనాలను మీ ఇంటికి దగ్గరలోని సేఫ్టీ ఉన్న ప్రదేశములోనే పార్కింగ్ చేయాలి

2. GPS ను ఖచ్చితముగా వాహనముకు అమర్చుకోవాలి

3. సీసీ కెమెరాలను చుట్టూరా ఏర్పాటు చేసుకోవాలి.

Also Read:

#karimnagar-jcb-robbery
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe