ఒలింపిక్స్ లో ‘భారత స్టార్లు తమ ప్రతిభను గొప్పగా ప్రదర్శించాలని.. డబుల్ గోల్ఫ్ లో భారత్ పతకం సాధిస్తుందని ఆశిస్తున్నట్టు’’ కపిల్ దేవ్ అన్నాడు.భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారధ్యంలో 1983లో భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలిచింది. ప్రస్తుతం ఆయన 'గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా' అధ్యక్షుడిగా ఉన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారులు మహిళలందరికీ అభినందనలు. పోటీల్లో ధైర్యంగా రాణించి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. అన్నీ సవ్యంగా సాగితే టోక్యో (7 పతకాలు) కంటే ఈసారి భారత్ ఎక్కువ పతకాలు సాధిస్తుందని ఆశిస్తున్నాను.
నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు గోల్ఫ్ ఆట ఈ స్థాయిలో పెరుగుతుందని అనుకోలేదు. త్వరలో ఈ ఆట క్రికెట్‌లా ఎదుగుతుందని ఆశిస్తున్నాను. భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ గంభీర్‌కు అభినందనలు. గంభీర్ భారత జట్టును గతంలో కంటే మెరుగైన స్థానానికి తీసుకెళతాడు.