Kaleshwaram Scam: చేసిందంతా కేసీఆర్, హరీశే.. వారి ఒత్తిడితోనే సంతకాలు.. కాళేశ్వరంపై విచారణలో సంచలన విషయలు

హరీశ్ రావు, కేసీఆర్ తనను బలవంతం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లపై సంతకం చేయించారని మాజీ ఈఎన్సీ నరేందర్‌‌‌‌ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. ఇంకా ఎల్ఎండీ సంస్థ సైతం మితిమీరిన జోక్యం చేసుకుని.. ఇప్పుడు సంబంధం లేదని చేతులు దులుపుకుందని కమిషన్ ఎదుట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Kaleshwaram Scam: చేసిందంతా కేసీఆర్, హరీశే.. వారి ఒత్తిడితోనే సంతకాలు.. కాళేశ్వరంపై విచారణలో సంచలన విషయలు
New Update

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ​పీసీ ఘోష్​ కమిషన్ విచారణలో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఒత్తిడితోనే ప్రాజెక్టు డిజైన్లకు తాను ఆమోదం తెలపాల్సి వచ్చిందని స్టేట్ ​సీడీవో(సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) మాజీ ఈఎన్సీ నరేందర్‌‌‌‌ రెడ్డి కమిషన్ ఎదుట చెప్పడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద నిర్మించ తలపెట్టిన బ్యారేజీలకు సంబంధించిన డిజైన్లను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనివ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్, హరీశ్ రావు, మాజీ ఈఎన్సీలు హరిరాం, నల్లా వెంకటేశ్వర్లు తదితరులు డిజైన్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి చేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని బ్యారేజీల నిర్మాణం నుంచి నిర్వహణ, క్వాలిటీ చెకింగ్​ వరకు ఇలా అన్ని దశల్లోనూ తప్పులు జరిగినట్లు ఆయన ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

బలవంతంగా చెక్ లిస్ట్ పై సంతకం..

ఇంకా.. కాళేశ్వరం డిజైన్లలోని హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ అంశాలకు తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తం చెక్ లిస్ట్ పై తాను సంతకం చేయనని చీఫ్ ఇంజనీర్ కు చెప్పానన్నారు. దీంతో.. నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫోన్లు చేసి తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. మీకు ఎలాంటి సమస్య రాదు.. సంతకాలు పెట్టాలి తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. పై స్థాయిలో మేమున్నాం.. అంటూ వారు తనతో బలవతంగా సంతకాలు చేయించారని కమిషన్ ఎదుట నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఇంకా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్, డ్రాయింగ్ లను ప్రీమెచ్యూర్ దశలోనే సర్టిఫై చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. నరేందర్ రెడ్డి అనేక సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను కేవలం డిజైన్ల వ్యవహారాలకు మాత్రమే బాధ్యుడనని.. కానీ, తనపై ఒత్తిడి తెచ్చి హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్‌ అంశాల చెక్​లిస్టుపై సైతం సంతకాలు చేయించారని స్పష్టం చేసినట్లు సమాచారం.

publive-image

మితిమీరిన L&T జోక్యం

ఇంకా ఎల్ అండ్ టీ సంస్థ ప్రమేయం సైతం ఆయన అనేక విషయాలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ప్రతీ కాంపోనెంట్ డిజైన్ లోనూ ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. చీఫ్‌ ఇంజనీర్ గా ఉన్న తను తయారు చేసిన ప్రతి డిజైన్ లోనూ ఎల్ఎండీ సంస్థ జోక్యం చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా సమాంతర డిజైన్లు ఇచ్చిందని ఆయన చెప్పినట్లు సమాచారం. కానీ.. ఇప్పుడు నష్టం జరిగిన తర్వాత ఆ సంస్థ తనకు ఎలాంటి సంబంధం లేదని తప్పుుకుందని, ఆ బాధ్యతంతా సీడీఓదే అని మాట మార్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

publive-image

చెక్ లిస్ట్ తయారీలో గ్యాంబ్లింగ్..

అయితే..మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ఖరారు చేయడానికి ముందు రూపొందించిన చెక్ లిస్ట్ లోనే గ్యాంబ్లింగ్ జరిగిందని ఆయన ఆరోపించినట్లు సమాచారం. కొన్ని రోజుల తర్వాత ఆ లెటర్ లో కొన్ని పదాలను కుట్రపూరితంగా తొలగించారన్న విషయం తాను గమనించినట్లు నరేందర్ రెడ్డి కమిషన్ కు చెప్పారు. దీంతో ఆర్టీఐ ద్వారా తాను అసలు లెటర్ ను పొందాల్సి వచ్చిందన్నారు. నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సేఫ్ గా ఉండేందుకే ఇలా చేశారని ఆరోపించారు. ఈ మేరకు తాను ఆర్టీఐ ద్వారా పొందిన కాపీని సైతం కమిషన్ కు నరేందర్ రెడ్డి అందించినట్లు తెలుస్తోంది.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe