Kakinada : ఏపీలో నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ రావు ఆత్మహత్య ఘటన మరువకముందే మరో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాకినాడలో వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి అదృశ్యం అయ్యారు. కాండ్రేగుల రాధాకృష్ణ.. పైలేరియా విభాగంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. అయితే, ఆయన యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యానాం బ్రిడ్జిపై రాధాకృష్ణకు చెందిన చెప్పులు,సెల్ ఫోన్ ను అధికారులు గుర్తించారు. తన తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేయడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుమారుడు నిఖిల్‌సాయి వ్యాఖ్యానించారు. తన తండ్రి ఆత్మహత్యకు మహిళా ఉద్యోగినే కారణమని ఆరోపించారు.
Also Read: అసెంబ్లీలో మరో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు