Ka Paul: ఏపీ రాజకీయాల గురించి కేఏ పాల్ కామెంట్స్!

భారత దేశంలో అంబేడ్కర్ అన్ని మతాల వారికి కూడా సమాన హక్కు కల్పించారని ఆయన వివరించారు. మణిపూర్ లో హింసాత్మక దాడులు జరుగుతుంటే మోడీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.

Ka Paul: ఏపీ రాజకీయాల గురించి కేఏ పాల్ కామెంట్స్!
New Update

ఏపీ రాజకీయాల్లో(Ap politics) చంద్రబాబు అరెస్ట్ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కూడా ఈ విషయం గురించి ప్రస్తావించారు. సెప్టెంబర్‌ 24న సాయంత్రం 5 గంటలకి ప్రజాశాంతి పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

మీటింగ్ కి వచ్చే వారందరికీ కూడా దేవుడికి ప్రార్థన చేసిన ఆయిల్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. భారత దేశంలో అంబేడ్కర్ అన్ని మతాల వారికి కూడా సమాన హక్కు కల్పించారని ఆయన వివరించారు. మణిపూర్ లో హింసాత్మక దాడులు జరుగుతుంటే మోడీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.

బీసీ కులంలో పుట్టిన నేను విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను..నేను ఎంపీగా గెలిస్తే మణిపూర్‌ లాంటి అల్లర్లు విశాఖలో జరగకుండా చేస్తాను. పాలన్నరావాలి..పాలన మారాలి అనే నినాదం ప్రజల నుంచే వస్తుందని ఆయన పేర్కొన్నారు. కేఏ పాల్‌ వస్తే రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేస్తాను అని అన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల భారీన పడకుండా కాపాడతా అని హామీ ఇచ్చారు. విశాఖలో ఎక్కువగా కమ్మ కులం వాళ్లే ఎంపీలు అవుతున్నారు.

దళితులు ఎక్కువ ఉన్న విశాఖలో ఒక్క దళితుడు ఎంపీ అవ్వకూడదా.? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ టీడీపీ జండా మొయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడడని అన్నారు.

పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవికి నటనలో మంచి పేరు ఉంది..పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తులు పెట్టుకుంటే ఏపీలో ఎవరు ఓటు వెయ్యారు అని పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ అనే ప్యాకేజీ స్టార్ట్ ని గెలిపిస్తారా... అవినీతి లేని కె.ఏ పాల్ ని గెలిపిస్తారా..అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నా సలహాతో టీడీపీ పార్టీ కి దూరంగా ఉన్నారని వివరించారు.

యాక్టర్స్ యాక్టర్స్ లాగా ఉండండి పవన్ కళ్యాణ్ లా పరువులు పోగొట్టుకోకండి...అంటూ సలమాలు ఇచ్చారు. పాల్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది, ప్రజలకు కష్టం రాకుండా కాపాడతాను, అవినీతి లేని రాష్ట్రం గా మారుస్తా అంటూ పేర్కొన్నారు. మోడీ తలుచుకుంటే చంద్రబాబు నాయుడు కి బెయిల్ వస్తాదని ఆయన అన్నారు.

#prajasanthi-party #ka-paul
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe