Hyderabad News: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం.. నడిరోడ్డుపై చిరువ్యాపారిని చితకబాదిన వైనం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరుడు, రౌడీ షీటర్ తన్ను ఓ చిరువ్యాపారిని విచక్షణ రహితంగా కర్రతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల వేళ రౌడీ షీటర్ ను బైండోవర్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

New Update
Hyderabad News: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం.. నడిరోడ్డుపై చిరువ్యాపారిని చితకబాదిన వైనం

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ముఖ్య అనుచరుడు, రౌడీ షీటర్ తన్ను మరో సారి తెగబడ్డాడు. ఓ వ్యక్తిని కర్రతో అతను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరు వ్యపారి అడిగినంత మూమూళ్లు ఇవ్వలేదన్న కారణంతోనే దాడికి దిగినట్లు ప్రచారం సాగుతోంది. బాధితులు ఎంతగా ప్రాధేయ పడుతున్నా కూడా విచక్షణా రహితంగా కొడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా అర్థం అవుతోంది.
ఇది కూడా చదవండి: BREAKING: హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత.. అవన్నీ పొంగులేటి పైసలేనా?

దాడి చేసిన వ్యక్తి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తో కలిసి సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యే అండదండలతోనే రౌడీషీటర్ తన్ను రెచ్చిపోతున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల వేళ రౌడీ షీటర్ ను బైండోవర్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా పోలీస్ కమిషనర్ స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మనుషులు రెచ్చిపోవడం ఇది మొదటి సారి కాదు. నెల రోజుల క్రితమే మాగంటి గోపీనాథ్ కు దగ్గరి వ్యక్తి అయిన భాస్కర్ ఓ వ్యక్తిని నడిరోడ్డపై చితకబాదాడు. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో భాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల వేళ ఇలా అనుచరులు రెచ్చిపోయి సామాన్యులపై దాడులకు దిగడం ఎమ్మెల్యేకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు