TTD Jobs : టీటీడీలో ఉద్యోగాలు..జీతం రూ. 50వేలకు పైనే..ఈ అర్హతలు ఉంటే దరఖాస్తు చేసుకోండి..!!

తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు మరో 10 రోజుల మాత్రమే అవకాశం ఉంది. https://ttd-recruitment.aptonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలనీ టీటీడీ సూచించింది.

New Update
TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.50 లక్షల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి..!!

టీటీడీలో ఉద్యోగం ఇస్తామంటే అంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పండి. అలాంటి టీటీడీలో ఉద్యోగం లభిస్తే ఎవరైనా సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఇక ఆ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే. అయితే టీటీడీ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఏఈఈ ఎలక్ట్రికల్ 4 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి గడువు ఇంకా పదిరోజులు మాత్రమే మిగిలి ఉంది. దరఖాస్తు చేయాలనుకునేవారు వెంటనే చేసుకోండి. టీటీడీలోని ఏఈఈ ఎలక్ట్రిక్ విభాగంలో రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ శాఖలో నాలుగు ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ (ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ )ఉత్తీర్ణత ఉండి ఆంధ్రప్రదేశ్ కు చెందిన హిందూ మతస్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా టీటీడీ పేర్కొంది.

వేతనం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 57,100 నుంచి 1,47,760 వరకు జీత భత్యం చెల్లిస్తుంది టీటీడీ.

వయోపరిమితి:
వయస్సు 42ఏళ్లకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు 5ఏళ్లు , పీహెచ్ అభ్యర్థులకు 10ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపిక చేసే అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రుపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ:
దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా చేసుకోవల్సి ఉంటుంది. చివరి తేదీ డిసెంబర్ 19, 2023.

ఇది కూడా చదవండి: ఆధార్ కార్డ్ కు సంబంధించి కీలక అప్ డేట్…వెంటనే ఈ పని చేయండి. లేదంటే ఫైన్ కట్టాల్సిందే..!!

Advertisment
తాజా కథనాలు