IDBI Recruitment 2023: ఉద్యోగార్థులకు అలెర్ట్.. ఐడీబీఐలో 600 ఖాళీలకు నోటిఫికేషన్!
IDBI రిక్రూట్మెంట్ 2023 డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రిక్రూట్మెంట్ నోటీసు ప్రకారం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 30న ముగుస్తుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,000 చెల్లించాలి.