AP Tenth Exams 2023: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం!
పదోతరగతి పబ్లిక్ పరీక్షల గురించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్క్రుతం పేపర్లను కొనసాగించాలని నిర్ణయించింది. మొదట్లో ఈ పేపర్లను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు చేయడంపై విమర్శలు తలెత్తడంతో సర్కార్ వెనకడుగు వేసింది. వచ్చే ఏడాది నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది.