TS LAWCET 2025 కౌన్సిలింగ్ ప్రారంభం.. లాస్ట్ డేట్ ఇదే..!

TS LAWCET 2025 కౌన్సిలింగ్ ఆగస్టు 4 నుండి ప్రారంభమైంది. 3, 5 ఏళ్ల LLB కోర్సులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14 లోపు దరఖాస్తు చేయాలి. ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ అప్లోడ్, చాయిస్ ఫిల్లింగ్, సీటు కేటాయింపు ఉంటాయి.

New Update
TS LAWCET 2025

TS LAWCET 2025

TS LAWCET 2025: తెలంగాణ రాష్ట్రంలో లా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే TS LAWCET 2025 కౌన్సిలింగ్ కు సంబంధించి నమోదు ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ద్వారా 3 ఏళ్ల, 5 ఏళ్ల LLB కోర్సులలో ప్రవేశాలు జరుగుతాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://lawcet.tgche.ac.in/ ద్వారా ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత:

3-ఏళ్ల LLB కోర్సు కోసం - అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తిచేసి ఉండాలి. జనరల్ క్యాటగిరీకి కనీసం 45% మార్కులు ఉండాలి. ఓబీసీలకు 42%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీసం 40% మార్కులు అవసరం. గ్రాడ్యుయేషన్‌లో తక్కువ మార్కులు ఉన్నవారు, పీజీ లేదా బి.ఎడ్ లో ఎక్కువ మార్కులు సాధించి ఉంటే కూడా అర్హత కలిగి ఉంటారు.


నమోదు ప్రారంభ తేది: ఆగస్టు 4, 2025

చివరి తేదీ: ఆగస్టు 14, 2025

ఫిజికల్ వెరిఫికేషన్: ఆగస్టు 8 నుండి 14 మధ్య

TS LAWCET కౌన్సిలింగ్(TS LAWCET Counseling).. 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్‌ ద్వారా లాగిన్ అవ్వాలి.

ఫీజు చెల్లింపు: డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కౌన్సిలింగ్ ఫీజును చెల్లించాలి.

సర్టిఫికేట్ అప్లోడ్: అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

అర్హుల జాబితా విడుదల: అధికారుల వెరిఫికేషన్ అనంతరం అర్హుల జాబితా విడుదల అవుతుంది.

చాయిస్ ఫిల్లింగ్: అభ్యర్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవచ్చు.

సీటు కేటాయింపు: ఎంపిక ప్రకారం సీట్లు కేటాయించబడతాయి.

ఆలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్: తాత్కాలిక సీటు కేటాయింపు పత్రాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేయాలి.

అందించిన పత్రాలతో పాటు కాలేజీలో హాజరై అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ప్రవేశం పూర్తిగా పారదర్శకంగా, ఆన్‌లైన్‌లోనే జరిగేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Advertisment
తాజా కథనాలు