Bhatti Vikramarka: ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీ నే అని ఆరోపించారు. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని అన్నారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్సు తో ఏడు మండలాలను ఏపిలో కలిపారు అని గుర్తు చేశారు.
భట్టి విక్రమార్క కామెంట్స్..
* ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యాడు
* క్యాబినెట్ విస్తరణ పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది
* పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుంది
* త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం
* పదిహేనేండ్లు మేమే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్ వి కల్లిబొల్లు కబుర్లే
* రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం
* పుట్టింది బతకడానికి. చావడానికి కాదు.
* ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోంది
* ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదు
* హరీష్ రావు కల్లిబోల్లి మాటలు మాట్లాడుతున్నారు
* చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహచరులు
* కేసీఆర్ తప్పిదాలు అయన్ని వెంటాడుతున్నాయి
* త్వరలో అన్ని బిల్లు లు క్లియర్ చేస్తాం..