శ్రీలంక జట్టు కోచ్ గా జయసూర్య!

శ్రీలంక జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జయసూర్య నియమితులయ్యారు.టీ20 వరల్డ్ వరకు ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ సిల్వర్‌వుడ్ శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నారు.ఈ సిరీస్ లో శ్రీలంక ఘోరంగా విఫలం కావటంతో సిల్వర్‌వుడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.

శ్రీలంక జట్టు కోచ్ గా జయసూర్య!
New Update

శ్రీలంక జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జయసూర్య నియమితులయ్యారు.టీ20 వరల్డ్ వరకు ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ సిల్వర్‌వుడ్ శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నారు.ఈ సిరీస్ లో శ్రీలంక ఘోరంగా విఫలం కావటంతో సిల్వర్‌వుడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు.

ఈ సందర్భంలో, శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు,మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. దీంతో 'టీ20' ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టుకు సలహాదారుగా వ్యవహరించిన మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య (55) తాత్కాలిక కోచ్‌గా నియమితులయ్యారు. ఇంగ్లండ్ సిరీస్ వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడని శ్రీలంక క్రికెట్ బోర్డు సమాచారం.

శ్రీలంక మాజీ ఆటగాడు జయసూర్య 110 టెస్టులు (6973 పరుగులు, 14 సెంచరీలు), 445 వన్డేలు (13430 పరుగులు, 28 సెంచరీలు) ఆడాడు. 1996లో శ్రీలంక జట్టు ప్రపంచకప్ గెలవడానికి ప్రధాన కారణం మరియు శ్రీలంక జట్టు సెలక్షన్ కమిటీకి అధిపతిగా వ్యవహరించాడు. అంతేకాకుండా 2010-15లో ఎంపీగా కూడా ఉన్నారు.

#jayasuriya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe