Lessons to Learn from Lord Krishna for Students: శ్రీకృష్ణుడి జన్మదినాన్ని (Janmashtami 2023) పురస్కరించుకుని హిందువులు జరుపుకునే పండుగ జన్మాష్టమి. ఈ ఏడాది సెప్టెంబర్ 6-7 తేదీల్లోని పలు ముహూర్తుల్లో ఈ పండుగను జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణుని జీవితం అన్ని వయసుల వారికి విద్యా పాఠాలు నేర్పుతుంది. మహాభారతంలోని ఐదుగురు పాండవుల్లో ఒకరైన అర్జునుడికి యుద్ధభూమిలో ఆయన చేసిన బోధలు జీవితంలో ఏ పరిస్థితిలోనైనా మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఇటు విద్యార్థులు(Students) శ్రీకృష్ణుడి జీవితం, ఆయన బోధనల గురించి తెలుసుకోవడానికి కొంత సమయం వెచ్చించవచ్చు. మంచి వ్యక్తిగా మారడానికి, జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకోవడానికి కృష్ణుడి బోధనలు, జీవితం సహాయపడుతాయి.
ఏది జరిగినా మంచికే జరుగుతుంది.
జీవితంలో చిన్న చిన్న ఎదురుదెబ్బలకు విద్యార్థులు నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ప్రతి వైఫల్యం కొత్త విషయాన్ని నేర్పుతుంది. కొన్నిసార్లు కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ ముందుకు సాగాలంతే. ఏం జరిగినా, మంచి కోసం జరిగిందని తర్వాత గ్రహించవచ్చు.
Also Read: కృష్ణ జన్మాష్టమి నాడు ఇలా చేస్తే ఎలాంటి ఆర్థికసమస్యలు ఉండవు..!
మీ పని చేయండి..ఫలితం ఆశించవద్దు:
కర్మకు ప్రత్యామ్నాయం లేదని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పాడు. ఫలితం గురించి ఆలోచించకుండా కర్మ చేయాలని కూడా చెబుతాడు. అంటే విద్యార్థులు కేవలం ఫలితం గురించి ఆందోళన చెందకుండా ప్రతిరోజూ సీరియస్‌గా చదవాలి. బాగా చదువుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి.
మీ స్నేహితులకు విశ్వసనీయంగా ఉండండి:
శ్రీకృష్ణుడు, సుధాముడి స్నేహం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కృష్ణ భగవానుడు రాజు అయినప్పటికీ తన మిత్రుడైన సుధామను బాల్యంలో ఎలా చూసుకునేవాడో చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. తన స్నేహానికి తన స్థాయి అడ్డు రానివ్వలేదు. విద్యార్థులు తమ స్నేహితులకు విధేయంగా ఉండాలని.. అవసరమైన సమయాల్లో వారికి అండగా నిలవాలని వీరి ఫ్రెండ్‌షిప్ నుంచి నేర్చుకోవచ్చు.
మైండ్ ఫుల్‌నెస్:
వర్తమానంలో జీవించాలని, భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందవద్దని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తాడు. వర్తమానంలో మీ పని సక్రమంగా ఉంటే.. మీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు వారి రోజువారీ పురోగతిని గమనించాలి. బలహీనతలపై క్రమం తప్పకుండా వర్క్ అవుట్ చేయాలి. వాటిని అధిగమించాలి. ఇది భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకైనా మరింత మెరుగ్గా సన్నద్ధం కావడానికి సహాయపడుతుంది.
మీ కోపాన్ని నియంత్రించుకోండి:
స్మృతి బ్రహ్మాద్ బుద్ధినాశో బుద్ధినాషాత్పర్యతి-
కోపం మీ తీర్పు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిత్యం కోపంగా ఉంటే జ్ఞాపకశక్తి తెలివితేటలు ఉండవు. తెలివితేటలు లేకపోతే నిర్ణయం తీసుకోవడం దెబ్బతింటుంది. అందుకే ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాల వైఫల్యాలకు కోపం ప్రాథమిక కారణం. నరకం మూడు ప్రధాన ద్వారాలలో ఇది ఒకటి. మిగిలిన రెండు దురాశ, కామం. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
ALSO READ: మంచినీళ్లు అతిగా తాగితే ఏం అవుతుందో తెలుసా?