TDP-JSP: రోడ్ల దుస్థితిపై రోడ్డెక్కిన జనసేన-టీడీపీ.!

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో "గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది" అనే నిరసన కార్యక్రమం చేపట్టారు టీడీపీ జనసేన కార్యకర్తలు. రోడ్ల దుస్థితిపై రోడ్డెక్కారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆందోళన చేశారు.

New Update
TDP-JSP: రోడ్ల దుస్థితిపై రోడ్డెక్కిన జనసేన-టీడీపీ.!

TDP-JSP: రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై రోడ్డెక్కారు జనసేన టీడీపీ కార్యకర్తలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. రోడ్లు బాగుచేయలేని దద్దమ్మ ఎమ్మెల్యే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, నిరసనలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన "గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది" కార్యక్రమాన్ని దక్షిణ చిరువోలు లంక రోడ్డులో నిర్వహించారు.

Also read: తీరు మార్చుకోని టీడీపీ చింతమనేని..గొర్రెల కాపరిపై దాడి.!

జనసేన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఏ ఒక్క రోడ్డు చూసినా గుంతలు తప్ప రోడ్డు కనిపించడం లేదని విమర్శించారు. రోడ్ల దుస్థితిపై నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోడ్లు మరమ్మత్తులు చేసి ప్రజల ఇబ్బందులు పరిష్కరిద్దాం అనే ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటే అందులో 15-18 వేల కోట్లు రోడ్ల కోసం కేటాయించాల్సి ఉందని, ఆ నిధులు కూడా ఉపయోగించుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రజలు అసమర్ధ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారని, ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకి కనీసం డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు.

Also read: అనంతపురంలో రచ్చకెక్కిన వైసీపీ వర్గ పోరు.!

తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ.. గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది కార్యక్రమాన్ని నిర్వహించడం కంటే నియోజకవర్గంలో గుంతల అవనిగడ్డ కు దారేది కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శలు గుప్పించారు. బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారన్న గ్యారెంటీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గుర్తుచేశారు. తాజాగా స్థానిక ఎమ్మెల్యే పాఠశాల బస్సు కూడా పిల్లలను తీసుకుని వెళ్తూ ప్రమాదానికి గురవడం అందరికీ తెలిసిన విషయమన్నారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే అందులో సంక్షేమానికి కేవలం 2.4 లక్షల కోట్ల రూపాయలను మాత్రమే వినియోగించారని, మిగిలిన డబ్బులు ఏమైపోయాయని ప్రశ్నించారు. అటు రాష్ట్రంలోనూ, ఇటు నియోజకవర్గంలోనూ పనికిమాలిన, అసమర్థ నాయకులను గెలిపించుకున్నామని అన్నారు. రానున్న ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీల కలయికలో వైసీపీ నామరూపాలు లేకుండా పోవడం తధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు