/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pawan-16-jpg.webp)
Janasena Party Symbol Issue: ఏపీ ఎన్నికల్లో గాజు గ్లాసు రచ్చ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం గాజు గ్లాసు ఫ్రీ సింబల్‌గా చేర్చడంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జనసేన.. గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్లకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. గాజు గ్లాసు ఇండిపెండెంట్లకు ఇవ్వడంతో జనాల్లో గందరగోళం నెలకొందని వాదనలు వినిపించారు. అయితే, జనసేన పిటిషన్‌పై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. 24 గంటల్లో జనసేన అభ్యంతరాలపై నిర్ణయం ఉంటుందని ఈసీ వెల్లడించింది.