Pawan Kalyan: బీ కేర్ ఫుల్.. జనసైనికులకు పార్టీ అధినేత పవన్ హెచ్చరిక..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు కీలక సూచనలు ఇచ్చారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్దని అన్నారు. సందేహాలుంటే పార్టీ రాజకీయ కార్యదర్శి దృష్టికి తీసుకురండని పిలుపునిచ్చారు. పొత్తులపై భిన్నంగా వ్యాఖ్యలు చేసే వారు వివరణ ఇవ్వాలని కోరారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. వారాహి యాత్రను అడ్డుకున్న పోలీసులు
New Update

Janasena Chief Pawan Kalyan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అధికార పార్టీ వైసీపీ ముందస్తుగానే అప్రమత్తమై ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రచార రంగంలోకి దింపింది. ఇదిలా ఉండగా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పటివరకు అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. మరోవైపు సీటు నాదంటే నాదంటే పలు నియోజకవర్గాల్లో అటు టీడీపీ నేతలు, ఇటు జనసేన నేతలు పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల ఘర్షణలకు కూడా దిగుతున్నారు.

Also Read: జగన్ కుంభకర్ణుడు.. 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా?.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న షర్మిల..!

ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికులకు కీలక సూచినలు ఇచ్చారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్దని అన్నారు. సందేహాలుంటే పార్టీ రాజకీయ కార్యదర్శి దృష్టికి తీసుకురండని పిలుపినిచ్చారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే పొత్తులని తెలిపారు. జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్ట్ ను విడుదల చేశారు.

విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తులో ఉన్నట్లు వెల్లడించారు. పొత్తులపై భిన్నంగా వ్యాఖ్యలు చేసే వారు వివరణ ఇవ్వాలని కోరారు. ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని..ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కాగా, త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని తమ ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించనున్నారు. 2024 లో ఉమ్మడి ప్రభుత్వం రావడం తధ్యం అంటూ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు.

#jana-sena-chief-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe