Janasena: జనసేన పోటీ చేసే 21 సీట్ల లిస్ట్‌ ఇదే..! పవన్ పోటీ అక్కడ నుంచే..?

టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే 21 సీట్ల లిస్ట్‌ పూర్తి వివరాలు తెలియాలంటే ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Janasena: జనసేన పోటీ చేసే 21 సీట్ల లిస్ట్‌ ఇదే..! పవన్ పోటీ అక్కడ నుంచే..?

 

జనసేన పోటీ చేసే సీట్లు...
1- రాజోలు,
2- రాజానగరం
3- తెనాలి
4- నెల్లిమర్ల
5- అనకాపల్లి
6- కాకినాడ రూరల్
7- నిడదవోలు
8- పిఠాపురం
9- భీమవరం
10- నరసాపురం
11- తాడేపల్లి గూడెం
12- పెందుర్తి
13- విశాఖ సౌత్‌
14- ఎలమంచలి
15- అవనిగడ్డ
16- అమలాపురం
17- విజయవాడ వెస్ట్‌
18 - దర్శి
19- తిరుపతి
20- అనంతపురం అర్బన్‌
21- పోలవరం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పై ఇవాళ క్లారిటీ రానుంది. రెండు చోట్ల పవన్‌ కల్యాణ్‌ పోటీకి రెడీ అవుతున్నట్లు తెలిసింది.  ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కాకినాడ పార్లమెంట్ నుంచి, పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటి చేసేందుకు దాదాపు ఖరారు అయ్యాయని త్వరలోనే పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది.

Also read: లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రి రాజీనామా!

ఎంపీగా అనకాపల్లి, కాకినాడ పార్లమెంటు స్థానాలు, భీమవరం, గాజువాక, తిరుపతిలో పరిశీలన అనంతరం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ ఉందని.. కాకినాడ పార్లమెంట్ నుండి పోటీ చేస్తే అదే పార్లమెంట్ లో ఉన్నా పిఠాపురం బెస్ట్ అని భావించారు పవన్. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ప్రభావం పార్లమెంట్ తో పాటు తూర్పుగోదావరి జిల్లా ఉండే అవకాశం ఉంది.

గత కొన్ని నెలలుగా పిఠాపురంలో ఉన్న ముఖ్య నేతలను తన నివాసానికి పిలిపించుకుని పవన్ కళ్యాణ్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. పిఠాపురం ఇన్చార్జిగా ఉన్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్..టీడీపీ ఇన్చార్జిగా ఉన్నా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ..పవన్ పిఠాపురం ఎమ్మెల్యే గా పోటీ చేస్తే వాళ్లు ఏలా రియాక్ట్ అవుతారోనని కాస్తా ఆందోళన కూడా నెలకొంది. టీడీపీ వర్మ ఇండిపెండెంట్ గా పోటి చేస్తారేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరోపక్క కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తే.. ఇప్పటికే టికెట్ ఆశించిన సాన సతీష్ బాబు పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisment
తాజా కథనాలు